ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం జగిత్యాలకు వస్తున్నారు. గీతా విద్యాలయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు జగిత్యాలలో పర్యటించనున్నారు. సోమవారం జగిత్యాల పట్టణానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రి సోమవారం ఉదయం 9 గంటలకు జగిత్యాలకు చేరుకుంటారు. పట్టణంలోని గీతా విద్యాలయంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతారు.
నిన్నఅంటే ఆదివారం ఆయన ఏపీలో మాట్లాడిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా చిలకలూరిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. కూటమిలో హుషారు తేవడానికి కలిసి సభ నిర్వహించాయి. కానీ, మోడీ ప్రసంగం చప్పగా సాగిందని సొంత కూటమి క్యాడర్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగిత్యాల పర్యటన నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ధర్మపురి నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నారు. సుమారు 1600 పోలీసులు మోహరించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
ఇదిలా ఉండగా.. ఈ సభకు కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల నుంచి లక్ష మందిని తీసుకురావాలని బీజేపీ భావిస్తున్నది. జగిత్యాల నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. కానీ, ఇది కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలకు కాస్త సమీపంలో ఉంటుంది.