వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్..

By team teluguFirst Published Nov 18, 2021, 5:17 PM IST
Highlights

మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి (venkatarami reddy) రాజీనామాను ఆమోదించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) పిల్ దాఖలైంది. ఐఏఎస్ అధికారి రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు పిల్‌లొ(PIL) పేర్కొన్నారు.
 

మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి (venkatarami reddy) రాజీనామాను ఆమోదించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) పిల్ దాఖలైంది. వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాలు చేస్తూ రీసెర్చ్ స్కాలర్స్ ఆర్ సుబేందర్ సింగ్, జె శంకర్‌లు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఐఏఎస్ అధికారి రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు పిల్‌లొ(PIL) పేర్కొన్నారు. ఐఏఎస్‌లు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటారన్న పిటిషనర్లు.. వెకంట్రామిరెడ్డి నామినేషన్‌‌ను ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 

ఇక, ఈ పిల్‌లో పిటిషనర్లు ఈసీని, శాసన మండలి కార్యదర్శిని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిల్‌ను లంచ్ మోషన్‌‌గా స్వీకరించాలని సీనియర్ న్యాయవాది సత్యం రెడ్డి హైకోర్టును కోరారు. అయితే ఈ పిల్‌పై అత్యవరసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. 

Also read: MLC Elections 2021: కేసీఆర్ కాళ్లు మొక్కిన మాజీ అధికారి వెంకట్రామిరెడ్డికి చిక్కులు

సిద్దిపేట కలెక్టర్ పదవికి సోమవారం వెంకట్రామిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్చంద పదవీ విరమణ కోరుతూ సీఎస్ సోమేశ్ కుమార్‌కు రాజీనామా లేఖ పంపారు. దానిని ఆమోదిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆ వెంటనే టీఆర్‌ఎస్ తరఫున.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

అయితే ఆయన అభ్యర్థిత్వంపై తెలంగాణ కాంగ్రెసు నాయకులు.. శాసనమండలి రిటర్నింగ్ ఆఫీసర్ ఉపేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీమంత్రి షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి తదితరులు కలిసి కంప్లైంట్ ఇచ్చారు. ఐఏఎస్‌గా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని మండలి రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లారు. 

డీఓపీ అనుమతి లేకుండా వెంకట్రామిరెడ్డి రాజీనామాను కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించడాన్ని కాంగ్రెసు తీవ్రంగా పరిగణిస్తోంది. డీవోపీలో వెంకట్రామిరెడ్డిపై ఫిర్యాదులున్నాయని ఆరోపిస్తోంది. ఐఏఎస్ గా పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ ఆభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వెంకట్రామిరెడ్డిపై ఉన్న ఆరోపణలను, భూసేకరణలో హైకోర్టు ఆయనకు శిక్ష విధించిన విషయంతో పాలు పలు అంశాలతో కాంగ్రెసు పార్టీ ఓ నివేదిక తయారు చేసింది. ఆ నివేదికను జతచేస్తూ ఎన్నికల అధికారికి తెలంగాణ కాంగ్రెసు ఫిర్యాదు చేసింది. ఆయన నామినేషన్ ను తిరస్కరించాలని అందులో విజ్ఞప్తి చేసింది.

click me!