టిఆర్ఎస్ పుట్ట మధుకు మరో షాక్ (వీడియో)

First Published Dec 20, 2017, 6:01 PM IST
Highlights
  • మీటింగ్ వస్తానని హామీ ఇచ్చి దూరంగా ఉన్న పుట్ట మధు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన దివ్యాంగులు
  • వచ్చే ఎన్నికల్లో చూసుకుంటామంటూ వార్నింగ్

పెద్దపల్లి జిల్లాలో మంథని ఎమ్మెల్యే పుట్టా మధు కు మరో షాకింగ్ సంఘటన ఎదురైంది. పెద్దపెల్లి జిల్లా ముత్తరాం మండలం లో దివ్యాంగుల ఐక్యత మహా సభలు నిర్వహించారు. మంథని నియోజకవర్గ స్థాయి వికలాంగుల సమావేశంలో ఎమ్మెల్యే పుట్ట మధు పాల్గొనలేదని, మీటింగ్ సమయంలో కరెంటు కట్ చేశారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే పుట్ట మధు కు వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు.

గతంలోనే వికలాంగుల సంఘo నాయకులు మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ను కలిసి సమావేశానికి రావాలని ఆహ్వానించారు. వారికి వస్తానని మాట ఇచ్చారు. ఈ. సమావేశానికి మాజీ ఎంపీ వివేక్, trs రాష్ట్ర నాయకుడు సునీల్ రెడ్డి ని కూడా ఆహ్వానించారు. ఈ రోజు ఉదయం ఈ కార్యక్రమానికి పుట్ట మధు హాజరు కాకపోవడంతో వికలాంగులు నిరాశతో ,ఆయన ఏర్పాటు చేసిన భోజనాన్ని కూడా తిరస్కరించారు.

ఎన్నికల కు ముందు మాకు ఎన్నో హామీలు ఇచ్చిన ఎమ్మెల్యే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, మమ్మల్ని అవమాన పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో మంథని నియోజకవర్గ స్థాయిలోని దివ్యాంగుల ఓటు బలం చూపిస్తామని పుట్ట మదుకు హెచ్చరించారు. మధ్యాహ్నం వరకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావాలనే తమ సభకు రాలేదని ఆరోపించారు.

ఎమ్మెల్యే పుట్ట మధు కు వికలాంగ సంఘం నేత ఫోన్ చేసి ఎలా షాక్ ఇచ్చారో కింది వీడియోలో  మీరూ చూడండి.

click me!