తరగతి గదిలో పేలిన ఫోన్ బ్యాటరీ.. విద్యార్థికి గాయాలు

Published : Jan 19, 2019, 09:30 AM IST
తరగతి గదిలో పేలిన ఫోన్ బ్యాటరీ.. విద్యార్థికి గాయాలు

సారాంశం

తరగతి గదిలో ఫోన్ బ్యాటరీ పేలి  విద్యార్థి గాయాలపాలైన సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి లో చోటుచేసుకుంది. 

తరగతి గదిలో ఫోన్ బ్యాటరీ పేలి  విద్యార్థి గాయాలపాలైన సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి లో చోటుచేసుకుంది. బ్యాటరీ పేలుడుతో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని ఉపాధ్యాయులు జనగామ ఏరియా వైద్యశాలకు తరలించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన  మామిడాల శంకర్‌ కుమారుడైన రాజు ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి  చదువుతున్నాడు. శుక్రవారం స్కూల్ కి వెళుతుండగా.. ఆ బాలుడికి సెల్ ఫోన్ దొరికింది. దానిని తీసుకొని పాఠశాలకు వెళ్లాడు. స్కూల్ కి వెళ్లిన తర్వాత తన బ్యాగ్ లో నుంచి ఆ ఫోన్ బయటకు తీసి ఆడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆ ఫోన్ లోని బ్యాటరీ పేలింది.

దీంతో.. బాలుడికి తీవ్రగాయాయాలయ్యాయి. వెంటనే గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు.. బాలుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉంది.

PREV
click me!

Recommended Stories

Telangana : తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది? అత్యంత చిన్నది ఏది?
పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ | Asianet News Telugu