ఇఫ్లూలో పీజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులు...

By SumaBala Bukka  |  First Published Oct 20, 2023, 9:11 AM IST

ఉస్మానియా యూనివర్సిటీలోని.. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో బుధవారం రాత్రి పీజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరిగాయి. 


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోఉన్న ఇఫ్లూలో  లైంగిక వేధింపుల ఘటన వెలుగు చూసింది. ఇఫ్లూలో చదువుకుంటున్న ఓ పీజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులు యూనివర్సిటీలో ఉద్రిక్తతకు దారితీసాయి. వేధింపులకు పాల్పడిన నిందితులను అరెస్టు చేయాలని విద్యార్థులు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట ఆందోళనకు దిగారు.  యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్,  రెక్టార్ లు  విద్యార్థులకు రక్షణ కల్పించడంలో ఫెయిల్ అయ్యారని  ఆరోపించారు.

వీరిద్దరూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు..  ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ పీజీ విద్యార్థిని వాకింగ్ చేస్తోంది. కాస్త చీకటిగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లిన సమయంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వెంటనే ఆమె ఈ విషయాలను తోటి విద్యార్థులకు తెలిపింది. వీరంతా కలిసి ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Latest Videos

నేడే టీ బీజేపీ తొలి జాబితా... మొదటి విడతలో 65 స్థానాలకు అభ్యర్థుల పేర్లు..

ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట ఆందోళనకు దిగారు. క్యాంపస్లో విద్యార్థినులకు రక్షణ లేదని.. లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితులను గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, రాత్రి వరకు వీరు ఆందోళన చేసిన వర్సిటీ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు.  దీంతో కోపానికి వచ్చిన విద్యార్థులు ‘ వీసీ మిస్సింగ్’ అంటూ పోస్టర్లు వేశారు.

మరోవైపు ఓయూ పోలీసులు దీనిమీద కేసు నమోదు చేశారు.  విద్యార్థిని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి పంపించినట్లుగా పోలీసులు తెలిపారు. అక్కడ పరీక్షల అనంతరం భరోసా సెంటర్ కు పంపించినట్లు చెప్పారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.  విద్యార్థిని చెప్పినట్లుగా  ఆ చీకటిగా ఉండడంతో స్పష్టంగా కనిపించడం లేదని అన్నారు.

మరోవైపు వర్సిటీ అధికారులు కూడా దీనిమీద స్పందించారు.  విద్యార్థినిపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక వేధింపులు పాల్పడినట్లు సమాచారం అందిందని వెంటనే తాము పోలీసులకు తెలిపామని అన్నారు. దీనిమీద యూనివర్సిటీలోని ఫిర్యాదుల కమిటీ తక్షణమే చర్యలు  చేపట్టిందన్నారు. నిందితులను గుర్తించి వీలైనంత తొందరగా చర్యలు తీసుకుంటామన్నారు.

click me!