ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ నిధులు: ఆ రూ.760 కోట్లు ఏమయ్యాయి.. సునీల్ శర్మకు నోటీసులు

By sivanagaprasad KodatiFirst Published Nov 8, 2019, 2:42 PM IST
Highlights

తెలంగాణ ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీశ్ శర్మకు వరుస సమస్యలు తలబొప్పికట్టిస్తున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో పాటు పన్ను బకాయిలు చెల్లించాలని రవాణా శాఖ నోటీసులు పంపగా.. తాజాగా భవిష్యనిధి సంస్ధ (ఈపీఎఫ్) ప్రాంతీయ కమీషనర్ నోటీసులు పంపారు.

తెలంగాణ ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీశ్ శర్మకు వరుస సమస్యలు తలబొప్పికట్టిస్తున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో పాటు పన్ను బకాయిలు చెల్లించాలని రవాణా శాఖ నోటీసులు పంపగా.. తాజాగా భవిష్యనిధి సంస్ధ (ఈపీఎఫ్) ప్రాంతీయ కమీషనర్ నోటీసులు పంపారు.

ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ ఖాతాల్లో రూ.760 కోట్లు జమ కాలేదని తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై ఈ నెల 15లోగా పూర్తి సమాచారంతో హాజరు కావాల్సిందిగా ఆయన నోటీసులో పేర్కొన్నారు. భవిష్యనిధి సొమ్మె ఎప్పటికప్పుడు చెల్లించకపోతే భారీ జరిమానాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. 

మరోవైపు తెలంగాణ హై కోర్టు తెలంగాణ సర్కార్ తీసుకున్న రూట్ల ప్రయివేటీకరణపై స్పందించింది. 5100 రూట్లను ఇటీవల ప్రైవేటీకరిస్తున్నట్టు కెసిఆర్ సర్కార్ కాబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాజీ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు నిన్న హై కోర్టులో పిల్ దాఖలు చేసారు. కోర్టు నేడు విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. 

Also Read:ఆర్టీసీ ప్రైవేటీకరణపై హైకోర్టులో కేసీఆర్ కు చుక్కెదురు!

ఈ నేపథ్యంలో నేటి ఉదయం 10.30 గంటలకు హై కోర్ట్ ఈ విషయమై వాదనలు వినడం మొదలుపెట్టింది. ఈ సందర్భంగా కోర్టు తదుపరి విచారణను 11వ తేదికి వాయిదా వేసింది. అప్పటిలోగా ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయానికి సంబంధించిన కాబినెట్ ప్రొసీడింగ్స్ ని సమర్పించాలని ఆదేశించింది. 

అంతేకాకుండా తదుపరి విచారణ జరిగే 11వ తేదీ వరకు ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాల జోలికి వెళ్లోద్దని ఆదేశించింది. అంతే కాకుండా ఆర్టీసీని కూడా ఈలోపల కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది. 

నిన్న హై కోర్టులో ఆర్టీసీ సమ్మెపై హై కోర్టు వాదనలు విన్నది.  ఆర్టీసీ విభజన అంశం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కుదిపేస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఏపీ ప్రస్తుతం నిశితంగా పరిశీలిస్తోంది. 

Also Read:rtc strike: టీఎస్ ఆర్టీసీ లేనే లేదు: అశ్వత్థామ రెడ్డి, విశ్వేశ్వరరావు పిల్ పై రేపు విచారణ

గురువారం నాడు ఏపీ సీఎం జగన్ ఆర్టీసీపై జరిగే సమయంలో తెలంగాణలో చోటు చేసుకొన్న పరిణామాలపై చర్చించనున్నారు. మరోవైపు ఆర్టీసీ విభజన జరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరిణామం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వాన్ని కూడ ఆలోచనలో పడేసినట్టుగా సమాచారం.

click me!