నా మీద పోటీకి ఎవరొస్తారు కేసీఆరా, హరీశా.. ఓడితే రాజకీయాలు వదిలేస్తా: ఈటల సవాల్

Siva Kodati |  
Published : Aug 31, 2021, 06:04 PM IST
నా మీద పోటీకి ఎవరొస్తారు కేసీఆరా, హరీశా.. ఓడితే రాజకీయాలు వదిలేస్తా: ఈటల సవాల్

సారాంశం

కేసీఆర్, హరీశ్ రావులలో ఎవరు వస్తారో రావాలంటూ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని.. మీరు ఓడిపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఈటల స్పష్టం చేశారు.  

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే తనపై పోటీకి కేసీఆర్, హరీశ్ రావులలో ఎవరు వస్తారో రావాలంటూ సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడదామని ఈటల అన్నారు. తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని.. మీరు ఓడిపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ఆరిపోయే దీపమని.. ఆరిపోయే ముందే ఎక్కువ వెలుతురు ఇస్తుందంటూ ఈటల వ్యాఖ్యానించారు. తాను ఉన్నంతకాలం ప్రజల కోసం కొట్లాడతానని.. పదవుల  కోసం కాదని తేల్చిచెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి