Amit Shah: కేంద్ర మంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అదిలాబాద్‌లోని డైట్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం జరగనున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటున్నారు.
Amit Shah: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. వ్యూహా ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ తర్వాత మొదటిసారి ఆయన తెలంగాణలో ప్రకటించబోతున్నారు.
ఈ పర్యటనలో భాగంగా తొలుత ఆదిలాబాద్‌లో బహిరంగ సభలో పాల్గొనున్నారు. అనంతరం హైదరాబాద్‌లో మేధావుల సదస్సులో పాల్గొని రానున్న ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు కేంద్ర మంత్రి అమిత్‌షా. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ తర్వాత మొదటిసారి ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా .మధ్యాహ్నం ఒంటిగంటల ప్రాంతంలో ఆదిలాబాద్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశానికి డైట్ కళాశాల మైదానం వేదిక కాబోతుంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున జన సమీకరణ దిశగా బీజేపీ నేతలు సమయతమవుతున్నారు. ఈ బహిరంగ సభలో ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన హామీలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి షా పర్యటన ఊపునిస్తుందని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల ప్రారంభంలో తెలంగాణలోని మహబూబ్‌నగర్ , నిజామాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని రెండు ర్యాలీలలో కూడా ప్రసంగించారు. ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇది రాష్ట్రంలోని నిజామాబాద్‌లో పసుపు రైతుల నుండి పెండింగ్‌లో ఉన్న డిమాండ్ . రాష్ట్రంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీని కలిగి ఉంది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు అనేది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీ. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పలువురు సీనియర్ బీజేపీ నేతలు కూడా పాల్గొననున్నారు.
ఈ సమావేశం అనంతరం సాయంత్రం గం.4.15కు అదిలాబాద్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం.. సిఖ్ విలేజ్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో జరిగే మేధావుల సదస్సులో అమిత్ షా పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం ఏడున్నర గంటలకు తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో ఐటీసీ కాకతీయలో సమావేశం కానున్నారు. రాత్రి గం.9.40కి బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు అమిత్ షా.
ఎన్నికల షెడ్యూల్
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సోమవారం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రకటనలు చేశారు. ఎన్నికల తేదీలను ప్రకటిస్తూ.. నవంబర్ 7న మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో నవంబర్ 7, 17 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అలాగే.. రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 23 న ఓటింగ్ జరగనుంది, అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3 న జరుగుతుంది.