ఈ శైలజా రెడ్డి సూపర్.. సొంత ఫ్లాట్ అమ్మి..

Published : Sep 18, 2018, 11:36 AM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
ఈ శైలజా రెడ్డి సూపర్.. సొంత ఫ్లాట్ అమ్మి..

సారాంశం

రాజకీయనాయకులు ఓట్ల కోసం హామీలు ఇచ్చి.. పదవి దక్కాక వాటిని మర్చిపోవడం సహజం. కానీ ఓ ఆమె మాత్రం.. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి తన సొంత ఆస్తిని కూడా అమ్ముకున్నారు. ఆమే శైలజారెడ్డి

రాజకీయనాయకులు ఓట్ల కోసం హామీలు ఇచ్చి.. పదవి దక్కాక వాటిని మర్చిపోవడం సహజం. కానీ ఓ ఆమె మాత్రం.. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి తన సొంత ఆస్తిని కూడా అమ్ముకున్నారు. ఆమే శైలజారెడ్డి

పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రజలకు ఎన్నో హామీలిచ్చి చేవెళ్ల జడ్పీటీసీగా గెలుపొందారు చింపుల శైలజా సత్యనారాయణరెడ్డి. వాటిని నెరవేర్చేందు కు ప్రయత్నించినా ప్రభుత్వ నిధులు రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చేందుకు చేవెళ్లలోని బీజాపూర్‌ జాతీయ రహదారి పక్కనున్న తన ప్లాట్‌ను విక్రయించారు. దీంతో వచ్చిన రూ.24 లక్షలను మండలంలో అభివృద్ధి పనులకు కేటాయించారు. మొదటి కార్యక్రమంగా చేవెళ్ల మండలం మడికట్టు గ్రామంలో రైతులు పొలాలకు వెళ్లే రోడ్డు పనులకు మంగళవారం భూమి పూజ చేయనున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న జడ్పీటీసి శైలజను తోటి సభ్యులు ఆదర్శంగా తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌