అహంకార, అవినీతి కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు.. : కేసీఆర్ పై బీజేపీ ఫైర్

By Mahesh Rajamoni  |  First Published Oct 23, 2023, 10:39 AM IST

Telangana Assembly polls: అహంకార, అవినీతి కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్), భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్)ల‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ తీరుపైనా మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్యర్థుల తొలి జాబితాను విడుద‌ల చేసింది. ఈ క్రమంలోనే కోరట్ల నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్న ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు.
 


BJP MP Arvind Dharmapuri: తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛమైన పాలనకు ఆకర్షితులవుతున్నారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. ఇదే స‌మ‌యంలో అహంకార, అవినీతి కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని ఆయ‌న ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్), భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్)ల‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్యర్థుల తొలి జాబితాను విడుద‌ల చేసింది. ఈ క్రమంలోనే కోరట్ల నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్న ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు.

"గత 2 నుండి 3 సంవత్సరాల తెలంగాణ ఎన్నికల రాజకీయాలను మీరు చూస్తుంటే, ఇది BRS-BJP మధ్య స్పష్టమైన-ప్రత్యక్ష పోరు... తెలంగాణ ప్రజలు మోడీ పాలనకు ఆకర్షితులవుతున్నారు. వారు స్వచ్ఛమైన పాలనను ఇష్టపడతారు. అహంకారపూరిత అవినీతి పాలన కుటుంబ పాలనతో వారు విసిగిపోయారు... అనేక రాష్ట్రాల్లో వారి (కాంగ్రెస్) ఉనికి లేకపోవడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి. కుటుంబ పాలన, కుల ఆధారిత రాజకీయాలు, సమాజాన్ని కులాల ప్రాతిపదికన విభజించడం చూసి ప్ర‌జ‌లు విసిగిపోయారు" అని బీజేపీ ఎంపీ అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ అదే మార్గంలో న‌డుస్తోంద‌ని విమ‌ర్శించారు. బీఆర్ఎస్ కూడా ఇదే త‌ర‌హాలో ముందుకు సాగుతున్న‌ద‌ని మండిప‌డ్డారు.

Latest Videos

undefined

తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు భారత ఎన్నికల సంఘం అక్టోబర్ 9న ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కోరుట్ల నియోజకవర్గం నుంచి ధర్మపురిని బరిలోకి దింపేందుకు బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. అలాగే, వీరితో పాటు బోథ్‌ నుంచి ఎంపీ సోయం బాపురావు, కరీంనగర్‌ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌లను బరిలోకి దింపింది. ఎమ్మెల్యే రాజా సింగ్ గోషామహల్ నుంచి, ఈటల రాజేందర్ రెండు స్థానాలు హుజూరాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు.

ఇదిలావుండగా, మహ్మద్ ప్రవక్తపై ఆయన చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో బీజేపీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వడంతో గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే టి రాజా సస్పెన్షన్‌ను ఉపసంహరించుకున్నారు. ఎమ్మెల్యేను ఆగస్టులో సస్పెండ్ చేసి షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అధికార భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ వుంటే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 2018లో జరిగిన మునుపటి అసెంబ్లీ ఎన్నికలలో అధికార పార్టీ బీఆర్ఎస్ 119 స్థానాలకు గాను 88 స్థానాలను గెలుచుకోగలిగింది. 47.4 శాతం ఓట్ల వాటాను కలిగి ఉంది. కాంగ్రెస్ 19 సీట్లతో రెండో స్థానంలో నిలవ‌గా, దాని ఓట్ షేర్ 28.7 శాతంగా ఉంది.

click me!