కడెం ప్రాజెక్టుకు బారీగా వరద నీరు వచ్చి చేరుతున్నతరుణంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే ప్రాజెక్టుకు చెందిన ఎడమ కాాలువ దెబ్బతింది. దీంతో ఎడమ కాలువ కింది భాగం నుండి కూడా వరద నీరు వెళ్లిపోతుందని అధికారులు గుర్తించారు.
నిర్మల్: Kadam ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మంగళవారం నాడు రాత్రి కడెం పట్టణంలోని మార్కెట్ రోడ్డులోని నివాసం ఉండే 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు రైతు వేదిక, గెస్ట్ హౌస్, ప్రభుత్వాసుపత్రి ప్రాంతంలో తలదాచుకున్నారు. కడెం ప్రాజెక్టుకు 5 లక్షల Cusecల వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు దిగువన ఉన్న 25 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు అధిారులు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు చాటింపు వేయించారు.
undefined
దీంతో మంగళవారం నాడు రాత్రే పలు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. అయితే బుధవారం నాడు మధ్యాహ్నానికి ఎగువ నుండి వచ్చే ఇన్ ఫ్లో తగ్గిపోయినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఎగువ నుండి కడెం ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందని అధికారులు చెబుతున్నారు. కడెం ప్రాజెక్టు నుండి 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే బుధవారం నాడు మధ్యాహ్నం నుండి కడెంతో పాటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ వర్షం ఇలానే కొనసాగితే ప్రాజెక్టుకు మళ్లీ Flood పెరిగితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ కొంత దెబ్బతిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఏ మేరకు కాలువ దెబ్బతిందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. దెబ్బతిన్న ఎడమ కాలువ కింద బాగం నుండి నీరు వెళ్లిపోతుంది. కడెం ప్రాజెక్టులో 700 అడుగుల మేర నీటి నిల్వ ఉంది.
also read:భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం: ఏడు మండలాలకు స్పెషల్ అధికారుల నియామకం
కడెం ప్రాజెక్టును లక్షన్నర డిశ్చార్జ్ కెపాసిటీతో నిర్మించారు. అయితే ఆ తర్వాత వచ్చిన వరదలతో కొన్ని గేట్లు అమర్చి ఈ ప్రాజెక్టు డిశ్చార్జ్ కెపాసిటీని 3 లక్షల క్యూసెక్కులకు పెంచారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టు డిశ్చార్జ్ ను ఐదు లక్షలకు పెంచాల్సిన అవసరం నెలకొంది. ఈ విషయమై అధికారులు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు.