భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం: ఏడు మండలాలకు స్పెషల్ అధికారుల నియామకం

Published : Jul 13, 2022, 04:23 PM IST
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం: ఏడు మండలాలకు స్పెషల్ అధికారుల నియామకం

సారాంశం

భద్రాచలం జిల్లాలోని ఏడు మండలాలకు ష్పెషల్ ఆఫీసర్లను జిల్లా కలెక్టర్ నియమించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వరద ప్రభావిత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు

భద్రాచలం:  Bhadrachalam జిల్లాలోని ఏడు మండలాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ జిల్లా కలెక్టర్ Anudeep బుధవారం నాడు ఆదేశాలు జారీ చేశారు.Flood Water  ప్రభావం ఉన్న ఏడు మండలాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ జిల్లా కలెక్టర్ అనుదీప్ నిర్ణయం తీసుకున్నారు. భద్రాచలం జిల్లాలో  భారీ వర్షాలు, వరదలపై కలెక్టర్ బుధవారం నాడు సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నది 53 అడుగులకు చేరింది.  ఇవాళ సాయంత్రం భద్రాచలం వద్ద గోదావరి నది 66 అడుగులకు చేరుకొనే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. మరో వైపు భద్రాచలం నుండి ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుండి ఛత్తీస్ ఘడ్ కు వెళ్లే మార్గంలో కూడా  రోడ్డుపైనే గోదావరి ప్రవహిస్తున్న పరిస్థితి ఉండడంతో ఈ రోడ్డుపై వాహనాలను అధికారులు నిలిపివేశారు. 

భద్రాచలం జిల్లాలోని ఏడు వరద ప్రభావిత మండలాలకు ఏడుగురు Special Officers కలెక్టర్ నియమించారు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సెలవుల్లో ఉంటే వెంటనే విధుల్లో చేరాలని కూడా కలెక్టర్ ఆదేశించారు. మరో వైపు  వరద ప్రభావం ఉన్న ఏడు మండలాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు.

also read:మంచిర్యాలలో ఇంటి చుట్టూ చేరిన వరద నీరు: కాపాడాలని ఓ వ్యక్తి ఆర్తనాదాలు

పునరావాస కేంద్రాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ సూచించారరు.  రాకపోకలు లేకుండా వైద్య సౌకర్యం కోసం ఇబ్బంది పడే ప్రజలకు ప్రత్యామ్నాయమార్గాల ద్వారా వైద్య సౌకర్యం అందేలా చర్యలు తీసుకోవాలని  అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భద్రాచలానికి దిగువన ఉన్న గోదావరి మరింత ఉగ్రరూంలో ప్రవహిస్తుంది. ధవళేళ్వరం  వద్ద 15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : చలి నుండి ఉపశమనం మూన్నాళ్ల ముచ్చటే.. మళ్లీ గజగజలాడించే చలి, పొగమంచు ఎక్స్ట్రా
Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం