టాస్క్‌ఫోర్స్‌లో వున్నప్పుడే బాధితురాలిపై సీఐ నాగేశ్వరరావు కన్ను వేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను ప్రముఖ వార్తా సంస్థ ఎన్టీవీ తన కథనంలో పేర్కొంది.
మహిళ కిడ్నాప్, అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాగేశ్వరరావు టాస్క్‌ఫోర్స్‌లో వున్న సమయంలోనే బాధిత మహిళపై కన్ను వేసినట్లుగా తెలుస్తోంది. భర్తను కలిసేందుకు టాస్క్‌ఫోర్స్ ఆఫీసుకు వచ్చినప్పటి నుంచి బాధితురాలిపై నాగేశ్వరరావు కన్నేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ క్రమంలో జూలై 7న బాధితురాలి ఇంట్లోకి ఇన్స్‌పెక్టర్ నాగేశ్వరరావు చొరబడ్డాడు.
అత్యాచారం, హత్యాయత్నం, కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. గన్ తో బెదిరించి భార్యాభర్తలను నాగేశ్వరరావు కిడ్నాప్ చేశాడు. సర్వీస్ రివాల్వర్ ను పీఎస్‌లో డిపాజిట్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. తనపై కేసు నమోదు కాగానే బెంగళూరుకు పారిపోయాడు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు నాగేశ్వరరావు. ఈ కేసులో 17 మంది సాక్ష్యుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా ఛానెల్ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
undefined
ALso Read:లైంగిక ఆరోపణలు.. భర్తపై ఉన్నతాధికారులు చర్యలు: మనస్తాపంతో శానిటైజర్ తాగిన ఎస్సై భార్య
ఇకపోతే.. మహిళ కిడ్నాప్, అత్యాచారం కేసులో సికింద్రాబాద్ మారేడ్ పల్లి సీఐ నాగేశ్వరరావుపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నెల 7వ తేదీన హస్తినాపురం వద్ద వివాహిత ఇంటికి వెళ్లి ఆమెపై సీఐ నాగేశ్వరరావు అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్త, నాగేశ్వరరావు మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకొంది. అంతేకాదు తమను సీఐ నాగేశ్వరరావు బెదిరించాడని బాధితులు ఫిర్యాదు చేశారు.
తన కారులోనే బాధితులను ఇబ్రహీంపట్నం వైపునకు తీసుకెళ్తున్న సమయంలో సీఐ కారు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదం జరిగిన తర్వాత భార్యాభర్తలు అక్కడి నుండి వెళ్లిపోయారు. అదే రోజున వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా హైద్రాబాద్ సీపీ సీవీ Anandమారేడ్ పల్లి సీఐ నాగేశ్వర్ రావును సస్పెండ్ చేస్తూ ఆదశాలు జారీ చేశారు.