
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో సమావేశం కోసం ఆదివారం నాడు మధ్యాహ్నం తెలంగాణ సీఎం KCR ముంబైకి చేరుకొన్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో భేటీలో పలు కీలక విషయాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.
రాష్ట్రాలకు కేంద్రం నుండి నిధుల విడుదలతో పాటు రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై కూడా Uddhav Thackerayతో కేసీఆర్ చర్చించనున్నారు. మరో వైపు NDA భాగస్వామ్య పక్షాల సీఎంలు కాకుండా ఇతర పార్టీల సీఎంలతో కూడా సమావేశం విషయమై చర్చించే అవకాశం ఉంది. అయితే ఏ రోజున ఈ విషయమై చర్చించాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కుల్లో మితిమీరుతున్న కేంద్రం జోక్యం, కేంద్రంపై పోరాటం లో భావసారూప్యం ఉన్న పక్షాల ఐక్యతపై ముఖ్యమం త్రి కేసీఆర్.. ఠాక్రే, పవార్‌తో చర్చించనున్నారు.
ఎన్డీఏయేతర పార్టీలతో కేసీఆర్ జట్టు కట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇవాళ ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు.. ఇద్దరు సీఎంల భేటీ ముగిసిన తర్వాత ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో కూడా సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.
బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీయేతర పార్టీలతో కేసీఆర్ 2018 నుండి సంప్రదింపులు సాగిస్తున్నారు.అయితే గతంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు ఆశించినంతగా ప్రయోజనాన్ని ఇవ్వలేదు దీంతో మరోసారి కేసీఆర్ బీజేపీయేతర పార్టీలను కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు. గత వారంలో ఉద్దవ్ ఠాక్రే కేసీఆర్ ను ముంబైకి రావాలని ఆహ్వానించారు. దీంతో ఇవాళ కేసీఆర్ ఉద్దవ్ ఠాక్రేతో భేటీ కానున్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా చర్చించనున్నారు. సీఎం కేసీఆర్ బృందం థాక్రే అధికారిక నివాసం వర్షాలోనే భోజనాలు పూర్తి చేసుకొని ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసానికి వెళ్లనున్నారు. జాతీయ రాజకీయ అంశాలపై పవార్‌తోనూ కేసీఆర్ చర్చించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు.
రెండు వారాల క్రితమే కేసీఆర్ తో బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా ఫోన్ లో మాట్లాడారు. బిజెపికి వ్యతిరేకంగా వివిధ ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా సీఎంలను కేసీఆర్ కలుస్తున్నారు.అటు మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు HD Devegowda కేసీఆర్‌కు మద్ధతు ప్రకటించారు. దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు సీఎం కేసీఆర్‌ను దేవేగౌడ అభినందించారు. మతతత్వ శక్తుల మీద పోరాటాన్ని కొనసాగించాల్సిందేనని ఆయన చెప్పారు. తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమవుతానని కేసీఆర్ దేవేగౌడకు చెప్పారు.
ఇటీవల కేసీఆర్ తమిళనాడు పర్యటనకు వెళ్లి ఆ రాష్ట్ర ము ఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో భేటీ అ య్యారు. జేడీఎస్ నేత దేవెగౌడ, సీపీఐ అగ్రనేత డీ రాజా, పలు రైతు సంఘాల నేతలు కేసీఆర్‌కు మద్దతు తెలిపారుపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సీఎం కేసీఆర్‌కు ఫోన్‌చేసి మేము సైతం మీ వెంటే అని చెప్పా రు.