మహిళ ను కిడ్నాప్ చేసి అత్యాచారం.. నిందితులపై పీడీయాక్ట్

Published : May 31, 2021, 07:58 AM ISTUpdated : May 31, 2021, 08:02 AM IST
మహిళ ను కిడ్నాప్ చేసి అత్యాచారం.. నిందితులపై పీడీయాక్ట్

సారాంశం

సదరు మహిళను ఆటో ఎక్కించుకొని ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాతి రోజు.. ఏమీ తెలియనట్లు.. సదరు మహిళను మళ్లీ అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

కాలినడకన వెళ్తున్న ఓ మహిళను అపహరించి.. ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన కామారెడ్డి లోని భిక్కనూరులో చోటుచేసుకోగా... నిందితులపై జిల్లా ఎస్పీ శ్వేత పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

గతేడాది డిసెంబర్ 19న సిద్దిరామేశ్వరాలయం నుంచి ఓ మహిళ నడుచుకుంటూ తన ఇంటికి వెళ్తోంది. ఆమెకు మానసిక స్థితి సరిగా లేదు. దీనిని అవకాశంగా చేసుకొని.. సదరు మహిళపై ఇద్దరు కామాంధులు కన్నేశారు. 

మహిళ ఒంటరిగా వెళ్తుండటాన్ని గమనించి.. రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన ఆటో డ్రైవర్ బోయిడి శంకర్, తుమ్మలపూడి స్టీవెన్ లు పథకం వేశారు. సదరు మహిళను ఆటో ఎక్కించుకొని ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాతి రోజు.. ఏమీ తెలియనట్లు.. సదరు మహిళను మళ్లీ అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

ఈ విషయమై భిక్కనూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవ్వగా... నిందితులు శంకర్, స్టీవెన్ ను ఈ నెల 28న అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం వీరు నిజామాబాద్ జైల్లో ఉన్నట్లు ఎస్పీ వివరించారు. వీరి వల్ల సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతో.. పీడీ యాక్ట్ ప్రయోగించామన్నారు. దీని వల్ల మరో ఏడాదిపాటు వారు జైలు జీవితం గడపాల్సి ఉంటుందని భిక్కనూరు ఎస్సై నవీన్ కుమార్ పేర్కొన్నారు

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?