పీడీ యాక్ట్ పై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు షాక్: అడ్వైజరీ బోర్డు తీర్పు

By narsimha lode  |  First Published Oct 26, 2022, 3:53 PM IST

గోషామహల్  ఎమ్మెల్యే రాజాసింగ్  పై  నమోదు  చేసిన  పీడీయాక్ట్  ను అడ్వయిజరీ  బోర్డు సమర్ధించింది. ఈ  విషయమై  రాజాసింగ్  వినతిని  బోర్డు తిరస్కరించింది.


హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్ పై నమోదు చేసిన  పీడీ యాక్ట్  ను  అడ్వయిజరీ  బోర్డు సమర్ధించింది.   ఈ మేరకు బోర్డు ఇటీవలనే ప్రభుత్వానికి  తన నివేదికను  పంపింది. తనపై నమోదు చేసిన పీడీయాక్ట్  ను ఎత్తివేయాలని  రాజాసింగ్  చేసిన  వినతిని  బోర్డు  తిరస్కరించింది.

ఈ  ఏడాది సెప్టెంబర్ 29న పీడీ యాక్ల్ అడ్వైజరీ బోర్డు సమావేశం  జరిగింది. ఈ  సమావేశానికి చర్లపల్లి  జైలులో ఉన్న రాజాసింగ్ వీడియో  కాన్ఫరెన్స్  ద్వారా హాజరయ్యారు. తనపై నమోదు  చేసిన పీడీ  యాక్ట్  ను ఎత్తివేయాలని బోర్డును రాజాసింగ్ కోరారు. రాజాసింగ్  భార్య  ఉషాబాయి  పీడీ  యాక్ట్  ఎత్తివేయాలని బోర్డుకు  వినతి పత్రం సమర్పించింది. పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు చైర్మెన్ భాస్కరరావు, మరో ఇద్దరు జడ్జిల  సమక్షంలో విచారణ సాగింది.ఈ ఏడాది ఆగస్టు 25న పీడీయాక్ట్ నమోదు చేశారు.

Latest Videos

గోషామహల్  ఎమ్మెల్యే రాజాసింగ్ పై  పీడీ  యాక్ట్ నమోదు  చేయడానికి దారి తీసిన పరిస్థితులను  అడ్వైజరీ బోర్డుకు పోలీుసులు వివరించారు. రాజాసింగ్  పై  వందకుపైగా కేసులు నమోదైన విషయాన్ని   పోలీసులు  బోర్డు దృష్టికి  తెచ్చారు. ఇందులో కమ్యూనల్ కేసులు కూడా  ఉన్నాయని  వివరించారు. అయితే  తనపై నమోదైన  కేసులన్నీ  కొట్టివేసినట్టుగా  రాజాసింగ్ బోర్డు దృష్టికి తీసుకువచ్చారు.  రాజాసింగ్  పై నమోదు చేసిన పీడీ యాక్ట్  ను  పీడీయాక్ట్  అడ్వైజరీ బోర్డు సమర్ధించింది. అయితే    ఈ  విషయమై హైకోర్టు లో రాజాసింగ్ సవాల్  చేయనున్నారు. 

రాజాసింగ్ పై దాఖలు చేసిన పీడీయాక్ట్ పై   ఉషాబాయ్ దాఖలు చేసిన  పిటిషన్ ను హైకోర్టు  విచారిస్తుంది. పీడీయాక్ట్ పై  ప్రభుత్వం కౌంటర్  దాఖలు  చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని  వ్యక్తం  చేసింది. ఈ విషయమై  ఈ నెల  28న  హైకోర్టులో  విచారణ  జరగనుంది. దీంతో ఈ  విచారణ  రోజునే ప్రభుత్వం  కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. పీడీయాక్ట్  అడ్వైజరీ బోర్డు తీర్పుు ను కూడ   ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చే అవకాశం  లేకపోలేదు.

ఈ ఏడాది ఆగస్టు 22 వ తేదీన సోషల్ మీడియాలో  రాజాసింగ్ ఓ  వీడియోను  అప్ లోడ్ చేశాడు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆరోపించింది. రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళనలు నిర్వహించారు. దీంతో ఆయనను ఆగస్టు 23న అరెస్ట్ చేశారు. అదే రోజున నాంపల్లి కోర్టు రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ నెల 25న రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదు చేసి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 

alsoread:పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు భేటీ: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన రాజాసింగ్

మహ్మద్  ప్రవక్తను కించపర్చేలా వ్యాఖ్యలు  చేసినందుకు గాను రాజాసింగ్  ను బీజేపీ సస్పెండ్ చేసింది. బీజేపీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు రాజాసింగ్  జైలు నుండే  సమాధానం ఇచ్చారు. తాను పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని ఆయన స్పష్టం  చేశారు.
 

click me!