నాంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్లకు చుక్కెదురు: ప్రచారాన్ని అడ్డుకున్నకాంగ్రెస్

By narsimha lode  |  First Published Oct 26, 2022, 3:43 PM IST

నాంపల్లిలో టీఆర్ఎస్  అభ్యర్ధి  కూసుకుంట్ల   ప్రభాకర్ రెడ్డికి నిరసన సెగ చోటు చేసుకుంది. అభివృద్ది  ఏం  చేశారో  చెప్పాలని  టీఆర్ఎస్ అభ్యర్ధిని  కాంగ్రెస్ క్యాడర్ నిలదీసింది.


మునుగోడు: నాంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్ధి  కూసుకుంట్ల ప్రభాకర్  రెడ్డికి బుధవారం  నాడు నిరసన సెగ తగిలింది.   ఎన్నికల  ప్రచారానికి వచ్చిన కూసుకుంట్ల ప్రభాకర్  రెడ్డినికాంగ్రెస్  కార్యకర్తలు అడ్డుకున్నారు. నాంపల్లిలో  అభివృద్ది జరగలేదని టీఆర్ఎస్  అభ్యర్ధి ఎన్నికల  ప్రచారాన్ని  అడ్డుకున్నాయి.కేటీఆర్, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా  కాంగ్రెస్  కార్యకర్తలు నినాదాలు  చేశారు.  

 కాంగ్రెస్  శ్రేణులు.  కాంగ్రెస్ శ్రేణులతో  టీఆర్ఎస్  శ్రేణులు  వాగ్వాదానికి దిగాయి. దీంతో ఇరు ర్గాల మధ్య  తోపులాట చోటు  చేసుకుంది.  దీంతో కొద్దిసేపు  ఉద్రిక్తత నెలకొంది..విషయం  తెలుసుకున్న పోలీసులు  రంగ  ప్రవేశం  చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం  కూసుకుంట్ల  ప్రభాకర్ రెడ్డి  ప్రచారం  నిర్వహించారు. 

Latest Videos

వచ్చే  నెల  3న మునుగోడు స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఈ ఏడాది ఆగస్టు 8న కోమటిరెడ్డి  రాజగోపాల్  రెడ్డి  ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేశారు. దీంతో  మునుగోడు ఉప  ఎన్నిక అనివార్యంగా మారింది.  రాజగోపాల్  రెడ్డి  ఎమ్మెల్యే పదవికి రాజీనామా  చేయడానికి  నాలుగు  రోజుల ముందే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా  చేశారు. అదే  నెల 21న  కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి బీజేపీలో  చేరారు.2018లో  మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. ఈ దఫా బీజేపీ  అభ్యర్ధిగా రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో  టీఆర్ఎస్  అభ్యర్ధిగా  బరిలోకి  దిగిన  కూసుకుంట్ల  ప్రభాకర్  రెడ్డికే టీఆర్ఎస్ నాయకత్వం టికెట్ కేటాయించింది. కాంగ్రెస్  అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి  ఈ  స్థానం  నుండి  పోటీకి దిగారు.మునుగోడులో  విజయం  సాధించాలని  మూడు  పార్టీలు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి.
 

click me!