గెలుపు గుర్రాలకే టిక్కెట్లు: ఉత్తమ్

First Published 22, Sep 2018, 4:11 PM IST
Highlights

గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇవ్వనున్నట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మహాకూటమి అభ్యర్థులు ఖరారు అంటూ వస్తున్న వార్తలపై స్పందించిన ఉత్తమ్ ఎక్కడా అభ్యర్థులను ప్రకటించలేదని స్పష్టం చేశారు. 

హైదరాబాద్: గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇవ్వనున్నట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మహాకూటమి అభ్యర్థులు ఖరారు అంటూ వస్తున్న వార్తలపై స్పందించిన ఉత్తమ్ ఎక్కడా అభ్యర్థులను ప్రకటించలేదని స్పష్టం చేశారు. 

అటు కాంగ్రెస్‌ పార్టీ ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు ముగిసిందని అభిప్రాయపడ్డారు. ఇంకా అభ్యర్థులను ఎక్కడా ప్రకటించలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు 1076 మంది ఆశావాహుల దరఖాస్తులు పీసీసీకి అందాయని తెలిపారు. 

శనివారం నుంచి అభ్యర్థుల స్క్రూటినీ చేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గానికి ముగ్గురిని ఎంపిక చేసి స్క్రీనింగ్ కమిటీకి పంపనున్నట్లు ఉత్తమ్‌ స్పష్టం చేశారు. సర్వే ఫలితాల ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సీట్ల సర్దుబాటు తర్వాత అభ్యర్థులను ప్రకటించనున్నామని ఉత్తమ్ తెలిపారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

ఆ లిస్ట్ ఉత్తిదే...మా అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు : ఎల్ రమణ

మహా కూటమి: 25 సీట్లు టీడీపీ టార్గెట్, అభ్యర్థులు వీరే...

 

 

 

Last Updated 22, Sep 2018, 5:03 PM IST