మహా కూటమిలోకి మందకృష్ణ: 12 సీట్లకు సిపిఐ బేరాలు

First Published 22, Sep 2018, 3:31 PM IST
Highlights

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మెర్పీఎస్) వ్యవ్థపాకుడు మందకృష్ణ మాదిగ మహా కూటమిలో చేరననున్నారు. అదే విధంగా ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కూడా మహా కూటమిలో చేరనున్నారు. 

హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మెర్పీఎస్) వ్యవ్థపాకుడు మందకృష్ణ మాదిగ మహా కూటమిలో చేరననున్నారు. అదే విధంగా ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కూడా మహా కూటమిలో చేరనున్నారు. ఈ విషయాన్ని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు.

తాము 12 సీట్లకు పోటీ చేస్తామని అడుగుతున్నట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ నెల 25వ తేదీన ఉమ్మడి ఎజెండాపై సమావేశం జరుగుతుందని చెప్పారు. సీట్ల పంపకాల్లో తిరుగుబాటు అభ్యర్థులను పోటీకి దించకూడదని మహా కూటమి భాగస్వామ్య పార్టీలు నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. 

కాంగ్రెసు, తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జన సమితి కలిసి మహా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ కూటమి ఏర్పడింది.

Last Updated 22, Sep 2018, 3:31 PM IST