కంటి సర్జరీ వాయిదా... యాత్రకు రెడీ అవుతున్న జనసేనాని

Published : Jun 22, 2018, 11:17 AM IST
కంటి సర్జరీ వాయిదా... యాత్రకు రెడీ అవుతున్న జనసేనాని

సారాంశం

కంటి సర్జరీ వాయిదా... యాత్రకు రెడీ అవుతున్న జనసేనాని 

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కంటికి జరగాల్సిన వాయిదా కొద్దిరోజులు వాయిదా పడింది.. ఈ నెల 24న ఆపరేషన్ చేయాలని భావించినప్పటికి.. కొన్ని కారణాల వల్ల సర్జరీని వాయిదా వేస్తున్నట్లు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గత కొన్నిరోజులుగా కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ బయటి కార్యక్రమాలకు హాజరైన ప్రతీసారి నల్లకద్దాలు పెట్టుకునేవారు. తన కంటికి ఇన్ఫెక్షన్ ఉందని.. అందుకే చలువ కళ్లద్దాలు పెట్టుకుంటున్నానని.. తప్పుగా భావించవద్దని అభిమానులకు చెప్పేవారు. ప్రజా పోరాట యాత్రలో కూడా ఇన్ఫెక్షన్ వల్ల ఆయన ఇబ్బంది పడ్డారు.. రంజాన్ సెలవుల కారణంగా యాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌నిచ్చిన ఆయన సర్జరీ చేయించుకోవాలని భావించారు.. శస్త్రచికిత్స ఆలస్యమవుతుండటంతో రెండో విడత ప్రజా పోరాట యాత్రలో పాల్గొవాలని పవన్ కళ్యాణ్ నభావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడనుంది.

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్