తప్పిన ముప్పు: రన్నింగ్ ఆర్టీసీ బస్సుకు ఊడిన వెనుక చక్రాలు

By narsimha lodeFirst Published Jul 21, 2021, 10:02 AM IST
Highlights

యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరు మండలం కాటేపల్లిలో బుధవారం నాడు ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.  బస్సు  వెనుక రెండు చక్రాలు ఊడిపోయాయి. దీంతో బస్సును డ్రైవర్ చాకచక్యంగా నిలిపివేశారు. 


మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లాలోని  మోటకొండూరు మండలం కాటేపల్లిలో బుధవారం నాడు  జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఆర్టీసీ బస్సులో ప్రయాణీస్తున్న 40 మంది సురక్షితంగా బయటపడ్డారు.హైద్రాబాద్‌ నుండి తొర్రూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు యాదాద్రి భువనగరి జిల్లాలోని కాటేపల్లి ప్రధాన రహదారిపై ప్రమాదానికి గురైంది. మోత్కూరు పట్టణంలోని ప్రధాన కూడలి వద్దకు బస్సు చేరుకోగానే బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి.  ఈ విషయాన్ని సకాలంలోనే గుర్తించిన డ్రైవర్ బస్సును చాకచక్యంగా నిలిపివేశారు.

బస్సు వెనుక చక్రాలు ఊడిపోయిన సమయంలో ఆ బస్సులో 40 మంది ప్రయాణీకులున్నారు. బస్సు  చక్రాలు ఎలా ఊడిపోయాయో అర్ధంకావడం లేదని డ్రైవర్ చెబుతున్నారు. బస్సు కండిషన్ సరిగా లేని కారణంగానే చక్రాలు ఊడిపోయి ఉండొచ్చనే అనుమానాన్ని డ్రైవర్ వ్యక్తం చేస్తున్నాడు.బస్సులోని ప్రయాణీకులను వేరే బస్సులో  వారి గమ్యస్థానాలకు పంపారు. 

click me!