
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ Mohammed Azharuddin లేకుండానే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో శివలాల్ యాదవ్, అర్షద్ ఆయూబ్, శేషు నారాయణ, మహేందర్ పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 9 మంది ఉన్న హెచ్‌సీఏ జనరల్ బాడీని.. 19కి పెంచుతూ తీర్మానం చేశారు. ప్రెసిండెంట్ అజహరుద్దీన్ అవసరం లేకుండానే నిర్ణయాలు తీసుకునేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు.
ఇక, ఈ ఏడాది సెప్టెంబర్‌లో హెచ్‌సీఏ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ జరగడం సంచలనంగా మారింది. మరోవైపు ఈ మీటింగ్ నిబంధనలుకు విరుద్దంగా జరిగిందని అజహరుద్దీన్ కామెంట్ చేశారు. ప్రెసిడెంట్ ఉంటేనే మీటింగ్‌కు వాల్యూ ఉంటుందన్నారు. ప్రెసిడెంట్ లేకుండా చేసిన తీర్మానాలు చెల్లవని ఆయన అన్నారు. దీంతో Hyderabad Cricket Association వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది.