సబిత ఇంటి ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల తల్లిదండ్రుల ఆందోళన

Siva Kodati |  
Published : Jul 31, 2022, 05:28 PM IST
సబిత ఇంటి ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల తల్లిదండ్రుల ఆందోళన

సారాంశం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల తల్లిదండ్రులు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పిల్లలు ఇబ్బందుల్లో వున్నారని.. తక్షణమే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు

హైదరాబాద్‌లోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (sabitha indra reddy) ఇంటి ముందు ఆదివారం ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల తల్లిదండ్రులు సబిత ఇంటి ముందు బైఠాయించారు. తమ పిల్లల సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామని పేరెంట్స్ మీడియాతో అన్నారు. పిల్లలు ఇబ్బందుల్లో వున్నారని.. తక్షణమే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని విద్యార్ధుల పేరెంట్స్ హెచ్చరిస్తున్నారు. పోలీసులు తల్లిదండ్రుల ఆందోళనను అడ్డుకోవడంతో సబిత ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

కాగా.. Basara IIT అధికారులు ఆదివారం నాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలనే డిమాండ్ తో విద్యార్ధులు శనివారం నాడు రాత్రి నుండి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చదువుకునే విద్యార్ధులను అడ్డుకుంటే Show cause నోటీసులు జారీ చేస్తామని అధికారులు ప్రకటించారు. షోకాజ్ నోటీసులు జారీ చేసినా కూడా తీరు మారకపోతే వారిని ట్రిపుల్ ఐటీ నుండి బర్తరఫ్ చేస్తామని అధికారులు ప్రకటించారు. 

Also REad:ఇక అలా చేస్తే షోకాజ్ నోటీసులు: బాసర ట్రిపుట్ ఐటీ కీలక నిర్ణయం

ఇకపోతే.. శనివారం నాడు రాత్రి నుండి బాసర ట్రిపుల్ ఐటీలోని ఈ 1, ఈ 2 విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు. మెస్ కాంట్రాక్టర్ ను  తొలగించాలని ఆందోళన చేస్తున్నారు. శనివారం రాత్రి భోజనం మానేసి నిరసనకు దిగారు. ఆదివారం నాడు టిఫిన్ కూడా మానేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్ధులతో ఇంచార్జీ వీసీ చర్చించారు. టెండర్ ప్రక్రియ పూర్తైన తర్వాత మెస్ కాంట్రాక్టర్ ను మార్చే అవకాశం ఉంటుందని వీసీ చెప్పారు.

ఈ నెల 16న బాసర ట్రిపుల్ ఐటీ లో పుడ్ పాయిజన్ అయింది. ఈ ఫుడ్ పాయిజన్ కారణంగా మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వీసీకి డెడ్ లైన్ విధించారు. ఈ డెడ్ లైన్ లోపుగా కాంట్రాక్టర్ ను మార్చకపోవడంతో విద్యార్ధులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ ను నెరవేర్చేవరకు ఆందోళన సాగిస్తామని విద్యార్ధులు ఆదివారం ఉదయం ప్రకటించారు. మెస్ కాంట్రాక్టర్ ను మార్చడానికి టెండర్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఈ మేరకు టెండర్ ప్రక్రియ ప్రారంభించారు అధికారులు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్