టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేకు ప్రమాదం.... హైదరాబాద్ కు తరలింపు

Published : Oct 01, 2018, 04:01 PM IST
టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేకు ప్రమాదం.... హైదరాబాద్ కు తరలింపు

సారాంశం

వరంగల్ జిల్లకు చెందిన ఓ టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే  ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడ్డారు. తన ఇంట్లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడటంతో ఎమ్మెల్యే తలకు తీవ్ర గాయమైంది. అయితే ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  

త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఈ పార్టీ తరపున టికెట్లు పొందిన అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఉంటూ ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూడా ఎన్నికల ప్రచారం కోసం తన నియోజకవర్గ పరిధిలోని ఉంటున్నారు. ఇలా ఆయన పరకాలలోని తన నివాసంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు గాయపడ్డారు.

బాత్రూంలో కాలుజారి పడటంతో ధర్మారెడ్డి ధర్మారెడ్డి తలకు తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే హన్మకొండలోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయనకు చికిత్స చేసిన వైద్యులు రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ధర్మారెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగానే వున్నట్లు వైద్యులు తెలిపారు. 
 
PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?