న్యూయార్క్‌లో మరణించిన హైద్రాబాద్ వాసి శ్రీధర్: డెడ్‌బాడీ కోసం కుటుంబసభ్యుల ఎదురుచూపులు

Published : Dec 02, 2020, 11:38 AM IST
న్యూయార్క్‌లో మరణించిన హైద్రాబాద్ వాసి శ్రీధర్: డెడ్‌బాడీ కోసం కుటుంబసభ్యుల ఎదురుచూపులు

సారాంశం

అమెరికాలోని న్యూయార్క్ బఫెల్లో సిటీలో హైద్రాబాద్ కు చెందిన పానుగంటి శ్రీధర్ మరణించాడు. శ్రీధర్ ఎలా మరణించాడనే విషయాన్ని డాక్టర్లు ఇంకా నిర్ధారించలేదు. శ్రీధర్ డెడ్ బాడీని హైద్రాబాద్ కు రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ బఫెల్లో సిటీలో హైద్రాబాద్ కు చెందిన పానుగంటి శ్రీధర్ మరణించాడు. శ్రీధర్ ఎలా మరణించాడనే విషయాన్ని డాక్టర్లు ఇంకా నిర్ధారించలేదు. శ్రీధర్ డెడ్ బాడీని హైద్రాబాద్ కు రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

కొంతకాలంగా  శ్రీధర్ అమెరికాలో ఉంటున్నాడు. 2015లో శ్రీధర్ పెళ్లి చేసుకొన్నాడు. శ్రీధర్ కు భార్య, కొడుకు ఉన్నాడు. ఈ ఏడాది నవంబర్ 27వ తేదీన శ్రీధర్ నిద్రలోనే మరణించాడు. ఈ విషయమై కుటుంబసభ్యులకు అమెరికా అధికారులు సమాచారం పంపారు. అయితే శ్రీధర్ ఎలా మరణించాడనే విషయమై వైద్యులు నిర్ధారించలేకపోయారు. మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు.

శ్రీధర్ మృతదేహాన్ని హైద్రాబాద్ కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ ద్వారా కోరారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. శ్రీధర్ మృతదేహాన్ని హైద్రాబాద్ కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖాధికారులతో సంప్రదింపులు జరపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!