రాంప్రసాద్ హత్య: కోగంటి సత్యంపై పంజగుట్టలో కేసు నమోదు

By narsimha lodeFirst Published Jul 7, 2019, 4:36 PM IST
Highlights

పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్య కేసులో కోగంటి సత్యంపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.  రాంప్రసాద్ భార్య వైదేహీ ఫిర్యాదు మేరకు పోలీసులు  ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

హైదరాబాద్: పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్య కేసులో కోగంటి సత్యంపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.  రాంప్రసాద్ భార్య వైదేహీ ఫిర్యాదు మేరకు పోలీసులు  ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

కామాక్షి స్టీల్స్ వ్యవహరంలోనే  కోగంటి సత్యం, రాంప్రసాద్‌ మధ్య విబేధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.1995లో కామాక్షి స్టీల్స్ ఏర్పాటు చేశారు.2008లో బొండా ఉమ నుండి  రాంప్రసాద్  షేర్లు కొనుగోలు చేశాడు. 

ఐదేళ్ల తర్వాత  రాంప్రసాద్, కోగంటి సత్యంల మధ్య విబేధాలు చోటు చేసుకొన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. రాంప్రసాద్‌ తనకు డబ్బులు ఇవ్వాలని  కోగంటి సత్యం చెబుతున్నారు.  ఈ విషయమై ఇరువురు ఒకరిపై మరోకరు ఫిర్యాదు చేసుకొన్నారు.

డబ్బుల విషయమై సత్యం తమను బెదిరింపులకు గురి చేశాడని  రాంప్రసాద్ భార్య వైదేహీ ఆరోపిస్తున్నారు. అయితే తనకు డబ్బులు చెల్లించకుండానే  అమ్మకూడదని సత్యం రాంప్రసాద్‌కు చెప్పాడంటున్నారు. కానీ, రాంప్రసాద్ క్లిరోస్కర్ కంపెనీతో రూ. 100 కోట్లకు ఒప్పందం చేసుకొన్నాడని తెలుస్తోంది.

ఈ విషయమై  వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయని అంటున్నారు. రాంప్రసాద్ చాలా మందికి డబ్బులు అప్పులు ఉన్నాడని కోగంటి సత్యం ఆరోపిస్తున్నారు. రాంప్రసాద్ బావ మరిది శ్రీనివాస్ తో కూడ ఆయనకు విబేధాలు ఉన్నాయని కోగంటి సత్యం ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

రాంప్రసాద్‌ను ఎవరు హత్య చేశారనే విషయమై  పంజగుట్ట పోలీసులు గాలింపు జరుపుతున్నారు. రాంప్రసాద్ హత్యకు గురైన స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. నాలుగు పోలీసు బృందాలు రాంప్రసాద్ హంతకుల కోసం గాలిస్తున్నారు.సీసీటీవీ పుటేజీలో రికార్డైన ముగ్గురు వ్యక్తులు ఎవరనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాంప్రసాద్ హత్యతో నాకు సంబంధం లేదు: కోగంటి సత్యం
 

click me!