హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీసులను ప్రశంసించిన అమితాబ్

Published : Jul 07, 2019, 03:40 PM IST
హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీసులను ప్రశంసించిన అమితాబ్

సారాంశం

బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీసులను ప్రశంసించారు. 

హైదరాబాద్:  బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీసులను ప్రశంసించారు. 

హైద్రాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డుపైన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఎల్ఈఢీ లై్ట్లతో ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా కేబీఆర్ పార్క్ వద్ద ఈ సిగ్నల్స్ ను ఏర్పాటు చేశారు.

కొత్త ట్రాఫిక్ సిగ్నల్స్‌ అంటూ హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోను చూసిన అమితాబచ్చన్  ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను చూసి స్పందించారు.

ఈ ఐడియా బాగుందని అమితాబచ్చన్  రీ ట్వీట్ చేశారు. ఈ తరహా విధానం మరింత ఉపయోగంగా ఉంటుందని  ఆయన అభిప్రాయపడ్డారు. కేబీఆర్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఈ సిగ్నల్స్ వల్ల ప్రయోజనం ఉందని భావిస్తే  సిటీలోని అన్ని ప్రాంతాల్లో ఇవే ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్