పంజాగుట్ట కారు ప్రమాదంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడు సాహిల్ హైకోర్టును ఆశ్రయించాడు.
హైదరాబాద్: పంజాగుట్ట కారు ప్రమాదంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పంజాగుట్ట కారు ప్రమాదంలో పోలీసులు తన పేరును అక్రమంగా చేర్చారని సాహిల్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసులు ఇరికించారని సాహిల్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. తన పేరు చెప్పేలా ఆసిఫ్ పై ఒత్తిడి చేశారని సాహిల్ ఆరోపిస్తున్నారు.సాహిల్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ నిర్వహించనుంది.
undefined
also read:జిల్లాల బాట పట్టనున్న రేవంత్ రెడ్డి: ఇంద్రవెల్లి నుండి శ్రీకారం
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ హైద్రాబాద్ లో ప్రజాభవన్ బారికేడ్ ను ఢీకొట్టాడనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ సమయంలో కారు నడిపింది తానేనని డ్రైవర్ ఆసిఫ్ పోలీసులకు లొంగిపోయాడు. ఆసిఫ్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో పనిచేసే డ్రైవర్ గా చెబుతున్నారు. అయితే ఈ విషయమై పంజాగుట్ట పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణలో పోలీసులు కీలక సమాచారం సేకరించారని తెలిసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సీసీపుటేజీని పరిశీలిస్తే కీలక విషయాలు వెలుగు చూశాయి.
also read:తెలంగాణ అసెంబ్లీలో బీజేపీపక్షనేత ఎవరు?: రేసులో ఆ నలుగురు
ప్రజా భవన్ వద్ద బారికేడ్ ను ఢీకొట్టిన సమయంలో వాహనాన్ని నడిపింది సాహిల్ గా తేలడంతో పంజాగుట్ట సీఐ దుర్గారావును సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. ఈ కేసులో డ్రైవింగ్ చేసిన వ్యక్తిని మార్చినందుకు కేసు నమోదు చేశారు.సాహిల్ మాత్రం పోలీసులకు చిక్కలేదు. తాజాగా హైకోర్టును సాహిల్ ఆశ్రయించాడు.ఈ కేసులో వ్యక్తులను మార్చిన విషయమై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నారని సమాచారం.
also read:కారణమిదీ: స్వంత పార్టీ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు
అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత సాహిల్ కన్పించకుండా పోయినట్టుగా పోలీసులు చెబుతున్నారు .సాహిల్ దుబాయ్ పారిపోయారనే అనుమాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.