యువతులపై లైంగిక దాడి.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

Published : Aug 13, 2021, 07:41 AM IST
యువతులపై లైంగిక దాడి.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

సారాంశం

తక్షణమే అతన్ని విధుల నుంచి తప్పిస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రావు ఓ ప్రకటన విడుదల చేశారు. బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్థారణ కావడంతో మహేష్ పై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

మహిళలు, యువతులను లైంగికంగా వేధించిన పంచాయతీ కార్యదర్శిపై ఉన్నతాధికారలు సస్పెండ్ చేశారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకోగా....  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోచమ్మగడ్డ తంతడా జూనియర్ పంచాయతీ కార్యదర్శి సంపంగి మహేష్ పై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. తక్షణమే అతన్ని విధుల నుంచి తప్పిస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రావు ఓ ప్రకటన విడుదల చేశారు. బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్థారణ కావడంతో మహేష్ పై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శి మహేష్, మరికొందరు ముఠాగా ఏర్పడి బాలికలపై లైంగిక దాడి చేసినట్లు వివిధ మాధ్యమాల్లో రావడంతో జిల్లా కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. రాజాపూర్ కు చెందిన ప్రైవేటు టీచర్ తో కలిసి మహేష్ ఈ అకృత్యాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం కార్యదర్శి మహేష్ ను జడ్చర్ల పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!