మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి షాక్.. పార్టీకి పాల్వాయి స్రవంతి రాజీనామా.. ఏ పార్టీలో చేరనున్నారంటే..

By Sumanth Kanukula  |  First Published Nov 11, 2023, 1:26 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు. 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధిష్టానానికి రాజీనామా లేఖను పంపించారు. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఆమె త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. 

ఇక, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే ఇటీవల రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరడంతో.. కాంగ్రెస్ పార్టీ ఆయనకు మునుగోడు టికెట్ ఇచ్చింది. అయితే ఈ పరిణామాలపై పాల్వాయి స్రవంతి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

Latest Videos

ఇదిలాఉంటే, మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆశించిన భంగపడిన చలమల కృష్ణారెడ్డి కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కృష్ణారెడ్డికే మునుగోడు  బీజేపీ టికెట్‌ను ఆ పార్టీ అధిష్టానం కేటాయించింది. 

click me!