Bigg Boss 7 Telugu : పల్లవి ప్రశాంత్ సంగతి సరే... మరి వాళ్ల పరిస్థితి ఇక అంతేనా?

By Arun Kumar PFirst Published Dec 25, 2023, 10:45 AM IST
Highlights

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ తో పాటు అతడి ఫ్యాన్స్ అరెస్ట్ చేసారు జూబ్లీహిల్స్ పోలీసులు. తాజాగా మరో ముగ్గురికి కూడా  పోలీసులు అరెస్ట్ చేసారు. 

హైదరాబాద్ : ప్రజలకు వినోదాన్ని అందించడానికి రూపొందించిన బిగ్ బాస్ తెలుగు షో వివాదానికి దారితీసింది. ఇటీవల ముగిసిన సీజన్ 7 లో సాధారణ పల్లెటూరు కుర్రాడు, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజయం సాధించాడు. ఇలా శివాజి లాంటి సినీ హీరోను, మరికొందరు సీరియల్ ఆర్టిస్ట్ లను ఓడించి రైతుబిడ్డ బిగ్ బాస్ టైటిల్ సాధించడం సంచలనంగా మారింది. అయితే ప్రశాంత్ ను ఎంతో అభిమానించి బిగ్ బాస్ విజేతగా నిలిపిన అభిమానులే అతడిని జైలుపాలు కూడా చేసారు. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన ఆనందాన్ని ఎక్కువసేపు అనుభవించకముందే పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇలా ఇప్పటికే 20 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేసారు 

బిగ్ బాస్ ఫైనల్ రోజు పల్లవి ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్ద రచ్చరచ్చ చేసారు. హౌస్ లో ప్రశాంత్ ను ఇబ్బందిపెట్టాడంటూ సీరియల్ యాక్టర్ అమర్ దీప్, ఇంటర్వ్యూలో ఇష్టమొచ్చిన ప్రశ్నలు అడిగిందని గీతూ రాయల్ లపై దాడికి యత్నించారు. వారి కార్లను ధ్వంసం చేయడమే కాదు రోడ్డుపై వెళుతున్న ఆర్టిసి బస్సులను కూడా పగలగొడుతూ నానా హంగామా సృష్టించారు. దీంతో పల్లవి ప్రశాంత్ తో పాటు అతడి అభిమానులపై కేసులు నమోదయ్యాయి. 

Latest Videos

అన్నపూర్ణ స్టూడియో బయట పరిస్థితిని ప్రశాంత్ కు వివరించినా వినిపించుకోలేదని... కావాలనే అభిమానుల మధ్యకు వచ్చి రెచ్చగొట్టేలా వ్యవహరించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కారణమైన అతడితో పాటు మరికొందరిని కూడా జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా యూసుఫ్ గూడకు చెందిన సుధాకర్, సరూర్ నగర్ కు చెందిన హరినాథ్ రెడ్డితో పాటు మరో యువకుడు పవన్ కు కూడా అన్నపూర్ణ స్టూడియో వద్ద అల్లర్లతో సంబంధం వుందని పోలీసులు తేల్చారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. దీంతో అన్నపూర్ణ స్టూడియో అల్లర్ల కేసులో అరెస్టుల సంఖ్య 23 కు చేరింది. 

Also Read వాళ్లపై పరువు నష్టం దావా వేయనున్న పల్లవి ప్రశాంత్... రంగంలోకి 50 మంది లాయర్లు!

ఇక ఇప్పటికే పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడికి కోర్టు బెయిల్ ఇవ్వడంతో చంచల్ గూడ్ జైల్లోంచి బయటకు వచ్చారు. కానీ అతడిపై అభిమానంతో అలజడి సృష్టించిన అభిమానులను పట్టించుకునేవారు లేకుండాపోయారు. ఇప్పటికే 20 మందికి పైగా ప్రశాంత్ అభిమానులు అరెస్టయి జైల్లో వున్నారు. వారిని బయటకు తీసుకువచ్చిందుకు ఎవరూ ఎలాంటి ప్రయత్నం చేయడంలేదట. అనవసరంగా గొడవలు సృష్టించి జైల్లో పడ్డ తమవారిని బయటకు తీసుకురావాలంటూ వారి కుటుంబసభ్యులు కోరుతున్నారు.
 

click me!