పద్మినీరెడ్డి యూటర్న్:కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ప్రకటన

By Nagaraju TFirst Published Oct 11, 2018, 9:35 PM IST
Highlights

మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ సతీమణి బీజేపీకి ట్విస్ట్ ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పద్మినీరెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 
 

హైదరాబాద్: మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ సతీమణి బీజేపీకి ట్విస్ట్ ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పద్మినీరెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 

అయితే పద్మినీరెడ్డి బీజేపీలో చేరినప్పటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న దామోదర రాజనర్సింహ సతీమణి బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ పార్టీలో సైతం లుకలుకలు వినిపించాయి. అయితే తొమ్మిది గంటలపాటు జరిగిన రాజకీయ హైడ్రామాకు ఆమె స్వస్తి పలికారు. తాను యూటర్న్ తీసుకుంటున్నట్లు తెలిపారు. 

తాను ఉదయం బీజేపీలో చేరిందింది అనుకోకుండా జరిగిన ఘటన అంటూ పద్మినీరెడ్డి తెలిపారు. తాను బీజేపీలో చేరినప్పటి నుంచి కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కార్యకర్తల అభీష్టం మేరకు తిరిగి కాంగ్రెస్ లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.  

తాను కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ టిక్కెట్ ఆశించడం లేదని సామాన్య కార్యకర్తగానే పనిచేస్తానని తెలిపారు. అభిమానుల కోరిక మేరకు తిరిగి కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ఆమె ప్రకటించారు.

click me!