రాహుల్ టూర్ ఖరారు: ఈనెల 20,27న రాహుల్ బహిరంగ సభలు

By Nagaraju TFirst Published Oct 11, 2018, 7:39 PM IST
Highlights

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన ఖరారు అయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజులపాటు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 20న కామారెడ్డి, బోథ్ లలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు.  

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన ఖరారు అయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజులపాటు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 20న కామారెడ్డి, బోథ్ లలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు.  

అలాగే అక్టోబర్ 27న వరంగల్, కరీంనగర్ జిల్లాలలో రాహుల్ గాంధీ పర్యటించనున్నట్లు తెలిసింది. రాహుల్ బహిరంగ సభల్లో ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. రాహుల్ సభలను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం కానుంది. అయితే 20న రాహుల్ పాల్గొననున్న బహిరంగ సభలు దాదాపు ఖరారు కావడంతో 27న జరగబోయే వరంగల్, కరీంనగర్ లలో ఎక్కడ నిర్వహించాలి అనేది కోర్ కమిటీ తేల్చనుంది.  

ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీలతో బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ ఎన్నికల  ప్రచార కమిటీ నిర్ణయించింది. కరీంనగర్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రకటించిందని ఈ నేపథ్యంలో సోనియాగాంధీ బహిరంగ సభలో పాల్గొంటే మరింత కలిసొచ్చే అవకాశం ఉందని పార్టీ భావిస్తోంది. 

ఇప్పటికే రాహుల్ గాంధీ టూర్ కన్ఫమ్ కావడంతో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ బహిరంగ సభల తేదీల ఖరారుపై ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. రాహుల్ గాంధీతో కనీసం 8 సభలు నిర్వహించాలని టీపీసీసీ భావించింది. అయితే ప్రస్తుతానికి నాలుగు సభలకు తేదీలు ఖరారు అయ్యాయి. మిగిలిన నాలుగు సభలకు రాహుల్ హాజరవుతారా లేరా అన్నది సస్పెన్షన్ .  
 

click me!