ఝలక్: జగ్గారెడ్డిపై బీజేపీ అభ్యర్థిగా దామోదర భార్య?

By narsimha lodeFirst Published Oct 11, 2018, 1:42 PM IST
Highlights

ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి నుండి  మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని రెడ్డిని  బీజేపీ బరిలోకి దింపే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
 

సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి నుండి  మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని రెడ్డిని  బీజేపీ బరిలోకి దింపే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

గురువారం నాడు బీజేపీ  కార్యాలయంలో  దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని రెడ్డి బీజేపీలో చేరారు.  ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పద్మిని రెడ్డి చురకుగా పాల్గొనేవారు.

గతంలో జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కోసం  తీవ్రంగానే ప్రయత్నించినా ఆమెకు  టిక్కెట్టు దక్కలేదు. ఈ దఫా కూడ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఒక్క టిక్కెట్టు మాత్రమే దక్కే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

ఈ తరుణంలోనే  కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మెన్‌గా ఉన్న దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని రెడ్డి బీజేపీలో చేరడం  రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి లేదా పటాన్‌చెరువు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఏదేని నియోజకవర్గం నుండి  పద్మిని రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని  బీజేపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

అయితే సంగారెడ్డి నియోజకవర్గం నుండి  గతంలో  తూర్పు జయప్రకాష్ రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం  టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోసారి ఇదే స్థానం నుండి జయప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఈ తరుణంలోనే బీజేపీలో చేరిన పద్మినిరెడ్డిని సంగారెడ్డిని  బరిలోకి దింపితే  రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. 

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మెన్  దామోదర రాజనర్సింహ  సతీమణి పద్మిని రెడ్డి బీజేపీలో చేరడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. భర్త కాంగ్రెస్ పార్టీలో  కీలక పదవిలో ఉంటే.... భార్య మాత్రం బీజేపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకొంది. అయితే రానున్న రోజుల్లో  ఇంకా  చాలా మంది అసంతృప్తులు తమ పార్టీలో చేరే అవకాశం ఉందని బీజేపీ నేతలు  చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌కు భారీ షాక్: బీజేపీలో చేరిన దామోదర రాజనర్సింహ భార్య

బీజేపీలో చేరే విషయం మా ఆయనకు చెప్పా: పద్మిని రెడ్డి


 

click me!