రేవంత్ రెడ్డి.. నీ తల మీద కాలుపెట్టి తొక్కి కౌన్సిల్‌ల అడుగుపెడుతా: పాడి కౌశిక్ రెడ్డి

By telugu teamFirst Published Oct 9, 2021, 7:57 PM IST
Highlights

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఈటెల రాజేందర్ కోవర్ట్ అని, ఇది తాను కాదు.. కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ అంటున్నారని పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. హుజురాబాద్‌కు వచ్చి కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయి వుండి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని స్టేట్‌మెంట్ ఇచ్చిన నీది ఏ పార్టీనో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరికైనా తెలుసా అని వ్యంగ్యంగా అన్నారు.
 

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక వేడి రగులుకుంటున్నది. బీజేపీ అభ్యర్థి etela rajender, టీపీసీసీ అధ్యక్షుడు revanth reddyపై టీఆర్ఎస్ నేత padi koushik reddy విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో హుజురాబాద్ ప్రజలకు తెలియడం లేదని అన్నారు. దమ్ముంటే huzurabad bypollలో కాంగ్రెస్‌కు డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి.. ఈటల రాజేందర్ కోవర్ట్ అని అన్నారు.

తమ నాయకుడు కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. త్వరలోనే తాను శాసన మండలిలో అడుగుపెడతారని అన్నారు. రేవంత్ రెడ్డి.. నీ తల మీద కాలుపెట్టి తొక్కి కౌన్సిల్‌ల అడుగుపెడుతా అని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని దిక్కుమాలిన తనాన్ని రేవంత్ రెడ్డి చూపెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుడివై ఉండి మరో పార్టీ గెలువాలని కామెంట్ చేశావ్ అని అన్నారు. తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు రూ. 50 కోట్లు ఇచ్చి టీపీసీసీ పదవి తెచ్చుకున్నాడని ఆరోపించారు. అలాగే, ఈటెలతో కుమ్మక్కై రూ. 50కోట్లను పుచ్చుకున్నాడని ఆరోపణలు చేశారు.

Also Read: Huzurabad Bypoll: టాప్‌లో ఈటల జమున, తర్వాత రాజేందర్.. చివరలో గెల్లు శ్రీనివాస్

రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్ అని ఏ పార్టీలో అడుగుపెట్టినా భూస్థాపితం అవుతుందని అన్నారు. టీడీపీలో ఉన్నారని, బీజేపీలోనూ ఉన్నారని, ఆ రెండు పార్టీలు పత్తా లేకుండా పోతున్నాయని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అదే గతి పడుతుందని చెప్పారు. టీపీసీసీ పదవి తీసుకున్నాక తొలి పరీక్షగా హుజురాబాద్‌ ఎన్నికను తీసుకో.. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్లు తెచ్చుకో దమ్ముంటే అని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్లు దక్కితే తాను రాజకీయ సన్యాసం చేస్తారని, లేదంటే ఆయన టీపీసీసీ పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు.

ఈటల రాజేందర్‌కు ఆత్మగౌరవం లేదని, కేవలం ఆస్తులు, పదవుల మీద యావ ఉన్నదని పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు రైతు చట్టాలను నల్ల చట్టాలని విమర్శించిన ఆయన బీజేపీలో చేరగానే ఆ చట్టాలు తెల్లబడ్డాయా? అని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఎందుకు ఓటేయాలో చెప్పాలని అడిగారు. గ్యాస్ ధర వెయ్యి దాటిందని పెట్రోల్, డీజిల్ ధరలు వంద దాటాయని, ప్రజలు ఎందుకు ఆ పార్టీకి ఓటేయాలని నిలదీశారు.

click me!