హిందుత్వవాది చేయని పని ఓవైసీ చేశాడు

Published : Jan 12, 2017, 12:41 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
హిందుత్వవాది చేయని పని ఓవైసీ చేశాడు

సారాంశం

హజ్ యాత్రకు సబ్సిడీ తీసేయాలని అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్

ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లడానికి ప్రభుత్వం సబ్సిడీ  ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రతియేటా దీనికి సంబంధించి కోట్ల రూపాయిలను కూడా కేటాయిస్తున్నారు.

 

అయితే ఈ సబ్సిడీపై కరుడకట్టిన హిందుత్వవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

 

హజ్ యాత్రకు ముస్లింలకు సబ్సిడీ ఇస్తే.. కాశీ, తిరుమల తదితర పవిత్ర ప్రాంతాలకు వెళ్లేందుకు హిందువులకు సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన ఓ ప్రకటన సంచలనంగా మారింది.

 

హజ్ యాత్రకు ఇస్తున్న సబ్సిడీ ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సబ్సిడీగా ఇస్తున్న డబ్బును ముస్లిం బాలికల విద్యకు ఉపయోగించాలని కోరారు.

PREV
click me!

Recommended Stories

Talasani As Revanth Reddy | Telangana Mock Assembly | KTR | KCR | Asianet News Telugu
నాన్ స్టాప్ 40 నిముషాలు నవ్వులు | Telangana Mock Assembly | KTR | Revanth Reddy | Asianet Telugu