ప్రభుత్వాసుపత్రిలో పేలిన ఆక్సిన్ సిలిండర్...చిన్నారులకు తప్పిన ప్రమాదం

First Published 1, Sep 2018, 10:39 AM IST
Highlights

సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. చికిత్స కోసం ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో హాస్పిటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు, ఆస్పత్రి సిబ్బంది రోగులను, చిన్నారులను బైటకు తరలించడంతో ప్రమాదం తప్పింది. 

ఇవాళ ఉదయం జిల్లా ఆస్పత్రిలోని పిల్లల వార్డులో ఒక్కసారిగా భారీ  శబ్దం చేస్తూ ఆక్సిజన్ సిలిండర్ పేలింది. దీంతో హాస్పిటల్ మొత్తం దట్టమైన పొగలతో నిండిపోయింది. ఈ పొగల కారణంగా రోగులు, చిన్నారులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. అయితే వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది స్థానికుల సాయంతో రోగులను, చిన్నారులను బైటకు తీసుకువచ్చారు. దీంతో ఫెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఆస్పత్రి వద్దకు చేరుకుని మంటల్ని అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Last Updated 9, Sep 2018, 12:40 PM IST