హరికృష్ణ మృతి: ప్రమాద బాధితులకు కేటీఆర్ అండ

By rajesh yFirst Published Sep 1, 2018, 10:34 AM IST
Highlights

సినీనటుడు దివంగత టీడీపీ నేత నందమూరి హరికృష్ణ ప్రమాద ఘటనలో గాయాలపాలైన యువకులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని అన్నెపర్తి వద్ద ఆగష్టు 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందారు. 

హైదరాబాద్: సినీనటుడు దివంగత టీడీపీ నేత నందమూరి హరికృష్ణ ప్రమాద ఘటనలో గాయాలపాలైన యువకులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని అన్నెపర్తి వద్ద ఆగష్టు 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందారు. 

హరికృష్ణ నడుపుతున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు గాయాలపాలయ్యారు. ఆ కారులో హైదరాబాద్ కు చెందిన ఫోటో గ్రాఫర్లు ప్రయాణిస్తున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్ కు ఫోటో గ్రాఫర్లు తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వారిని నార్కెట్ పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించి వైద్య సేవలందిస్తున్నారు.  

యువకులంతా నిరుపేదలు కావడంతో కనీసం వైద్యం చేయించుకునేందుకు కూడా డబ్బలు లేని పరిస్థితి. లోన్ ద్వారా కెమెరాలు కొనుక్కుని ఫోటోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు ఆయువకులు. అయితే ప్రమాదంలో కెమెరాలు కూడా పాడవ్వడంతో తమ ఉపాధి కోల్పోయామని బోరున విలపిస్తున్నారు. 


అయితే ఈ ఘటనపై జాన్ కొరా అనే వ్యక్తి నందమూరి హరికృష్ణ కారు అదుపుతప్పి బోల్తా పడ్డ ఘటనలో ఎదురుగా వస్తున్న కారులో గాయపడ్డ యువకులను ఆదుకోవాలని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ యువకులకు అవసరమైన వైద్యాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. 

వైద్య ఖర్చులను సీఎం సహాయ నిధి నుంచి అందించాలని కేటీఆర్ కలెక్టర్ కి సూచించారు. మంత్రి ఆదేశాలతో కలెక్టర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న యువకులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.  

ఈ వార్తలు కూడా చదవండి.

దిక్కు మొక్కు లేక హరికృష్ణ ప్రమాదంలోని క్షతగాత్రులు

click me!