ప్రారంభమైన నీట్ ప్రవేశ పరీక్ష: నిబంధనలతో విద్యార్ధుల ఇబ్బందులు

Published : May 07, 2023, 02:08 PM ISTUpdated : May 07, 2023, 03:10 PM IST
ప్రారంభమైన నీట్ ప్రవేశ పరీక్ష: నిబంధనలతో  విద్యార్ధుల ఇబ్బందులు

సారాంశం

నీట్ ప్రవేశ పరీక్ష  ఇవాళ ప్రారంభమైంది. తెలంగాణ నుండి సుమారు  70 వేల మంది విద్యార్ధులు  ఈ పరీక్షకు హాజరయ్యారు.  

హైదరాబాద్: నీట్  ప్రవేశ పరీక్ష ఆదివారంనాడు దేశ వ్యాప్తంగా  ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం నుండి  సుమారు  70 వేల మంది  విద్యార్ధులు ఈ పరీక్షకు  హాజరుకానున్నారు. 

ఇవాళ  మధ్యాహ్నం రెండు గంటల నుండి  ఐదు గంటల వరకు  ఈ పరీక్ష  నిర్వహించనున్నారు.  అయితే పరీక్షా హల్ లోకి ఇవాళ  ుదయం 11:30 గంటల నుండి విద్యార్ధులను అనుమతించారు. రాష్ట్రంలోని  21  పట్టణాల్లో  నీట్ పరీక్షా కేంద్రాలను  ఏర్పాటు  చేశారు.

ఎంబీబీఎస్, బీడీఎస్,  బీఎ‌ఎంఎస్, బీ‌యూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో  చేరేందుకు  నీట్  ప్రవేశ పరీక్ష రాయడం తప్పనిసరి.   రాష్ట్రంలోని 41 మెడికల్ కాలేజీల్లో 6,690 ఎంబీబీఎస్  సీట్లున్నాయి. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో  2,900 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 

ఆడ్మిట్ కార్టుతో పాటు  ఆధార్ కార్డు లేదా  ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును విద్యార్ధులు తమ వెంట తెచ్చుకోవాలని  అధికారులు సూచించారు. విద్యార్ధులకు  అవసరమైన పెన్నులను కూడా పరీక్షా కేంద్రంలోనే అనుమతిస్తారు.  

తెలుగుతో పాటు  మొత్తం  13 భాషల్లో నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.  వాచ్ సహా  ఎలాంటి ఎలక్ట్రానిక్  పరికరాలను  పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం లేదు. మరో వైపు విద్యార్ధినులకు  బంగారు ఆభరణాలను తీసివేయాలని  అధికారులు సూచించారు. చెవి పోగులు, ముక్కు పుడక  వంటివి తొలగిస్తేనే  పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. 

ఇదిలాల ఉంటే  హైద్రాబాద్ కేపీహెచ్‌బీ  పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా  వచ్చిన ముగ్గురు విద్యార్ధులను   పరీక్షా కేంద్రంలోకి   అనుమతించలేదు అభ్యర్ధులు.మరో వైపు ఏపీ నుండి సుమారు  63 వేల మంది విద్యార్ధులు  పరీక్షలు  రాశారు.  

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.