ఓఆర్ఆర్ లీజులో ఎన్‌హెచ్ఏఐ నిబంధనలకు నీళ్లు: కేసీఆర్ సర్కార్ పై కిషన్ రెడ్డి

By narsimha lode  |  First Published May 7, 2023, 1:22 PM IST

ప్రైవేటీకరణకు  వ్యతిరేకమని చెప్పుకొనే బీఆర్ఎస్  ఓఆర్ఆర్ ను  30 ఏళ్ల పాటు ఎందుకు లీజుకు ఇచ్చిందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ప్రశ్నించారు. 
 


హైదరాబాద్:ఓఆర్‌ఆర్ ను   30 ఏళ్ల పాటు  లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి  రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఆదివారంనాడు  హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  హెచ్ఎం‌డీఏకు  30ఏళ్లలో  టోల్ ట్యాక్స్ ద్వారా రూ. 75 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు.ఓఆర్ఆర్ పై ఆదాయం పెరుగుతుంది తప్ప, తగ్గదని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  తెలిపారు. నేషనల్  అథారిటీ  ఆఫ్ ఇండియా  నిబంధనల మేరకు లీజుకు  ఇచ్చినట్టుగా   తెలంగాణ సర్కార్  చెబుతున్న మాటలను  కిషన్ రెడ్డి తప్పు బట్టారు. 

ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్పిన బీఆర్ఎస్  పార్టీ , ఓఆర్ఆర్ ను ప్రైవేట్ సంస్థకు  ఎందుకు లీజుకు ఇచ్చారని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

Latest Videos

ఏ కంపెనీకి  టెండరు రావాలో ముందే  నిర్ణయించినట్టుగా  కన్పిస్తుందన్నారు.  ఓఆర్ఆర్ ప్రైవేటీకరణ పేరుతో  కల్వకుంట్ల కుటుంబం  కొత్త నాటకానికి తెరతీసిందని  ఆయన  ఆరోపించారు. హెచ్ఎండీఏ  మాస్టర్ ప్లాన్ కు 2031 వరకే అనుమతి ఉన్న విషయాన్ని ఆయన గుర్తు  చేశారు.  2031 వరకే  మాస్టర్ ప్లాన్ కు అనుమతి ఉన్నా  30 ఏళ్ల పాటు  ఓఆర్ఆర్ ను ఎలా లీజుకు ఇస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ప్రశ్నించారు.ఏపీలో విశాఖపట్టణం  స్టీల్ ప్లాంట్  కొనుగోలు  చేస్తామని  కేసీఆర్ సర్కార్  చేసిన హడావుడి చివరకు ఏమైందని  ఆయన  ప్రశ్నించారు.  

 తెలంగాణకే  తలమానికమైన ఓఆర్ఆర్ ను  కేసీఆర్ సర్కార్ ప్రైవేట్ సంస్థకు  30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడాన్ని  కిషన్ రెడ్డి తప్పుబట్టారు. ఓఆర్ఆర్ ను ఐఆర్‌బీ సంస్థ దక్కించుకుందని  కిషన్ రెడ్డి  చెప్పారు. ఓఆర్ఆర్ టోల్ ఫీజు ద్వారా తెలంగాణ సర్కార్ కు  ఏటా రూ. 415 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ప్రస్తుత బేస్ ప్రైజ్ ప్రకారం చూసుకున్న  30 ఏళ్ల పాటు  తెలంగాణకు  రూ.  30 వేల కోట్ల ఆదాయం వస్తుందని  ఆయన  చెప్పారు. 

ప్రతి ఏటా  10 శాతం  టోల్ ఫీజు పెంచితే   30 ఏళ్లకు  తెలంగాణ సర్కార్ కు  రూ. 70 వేల  కోట్ల ఆదాయం వస్దుందన్నారు.పుణె-ముంబై ఎక్స్‌ప్రెస్ ను  హైవేను పదేళ్లకు రూ . 8,875 కోట్లకు లీజుకు ఇచ్చినట్టుగా  కిషన్ రెడ్డి గుర్తు  చేశారు.   దేశంలోని  పలు  హైవేలను  పది నుండి  15 ఏళ్లకు మాత్రమే లీజుకు ఇచ్చిన విషయాన్ని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తావించారు. 

click me!