టిఎస్పిఎస్సీపై భగ్గుమన్న ఓయు జెఎసి (వీడియో)

Published : Feb 20, 2018, 05:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
టిఎస్పిఎస్సీపై భగ్గుమన్న ఓయు జెఎసి (వీడియో)

సారాంశం

హాల్ టికెట్లనే బస్ టికెట్లుగా పరిగణించాలి ఆప్షన్ ఇచ్చిన జిల్లాల్లోనే పరీక్షలు పెట్టాలి కుల వివక్ష పాటిస్తున్నారు

టిఎస్పిీపిఎస్సీ తీరుపై ఉస్మానియా విద్యార్థులు ఫైర్ అయ్యారు. టిఆర్టీ పరీక్షల నిర్వహణలో ఇష్టమొచ్చినట్లు సెంటర్లు వేస్తున్నారని ఆరోపించారు. దూరం ఉన్న జిల్లాలో సెంటర్లు వేస్తున్నారన్నారు. అభ్యర్థులు ఏ జిల్లాను ఎంచుకుంటే ఆ జిల్లాలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

టిఎస్పిఎస్సీలో కుల వివక్ష కూడా పాటిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. నిరుద్యోగులతో ఆడుకునే చర్యలు మానుకోవాలన్నారు. ఎంపిక చేసుకున్న జిల్లాల్లోనే పరీక్ష కేంద్రాలు ఉండాలన్నారు.

టిఎస్పిఎస్సీ చేతగానితనం మరోసారి బయటపడిందని నిరుద్యోగ జెఎసి ఛైర్మన్ కోటూరి మానవత్ రాయ్ విమర్శించారు.

తమ చేతగానితనాన్ని సిజిజి మీదకు నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. హాల్ టికెట్ నే బస్ టికెట్ గా పరిగణించి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు.

ఉస్మానియా వద్ద ఆందోళన చేసిన విద్యార్థులు ఏం చెబుతున్నారో కింద వీడియోలో చూడండి.

 

 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : కేవలం ఐద్రోజులే సంక్రాంతి హాలిడేస్.. కానీ 11 సెలవులు ఎక్స్ట్రా
హైద‌రాబాదీలు ఊపిరి పీల్చుకోండి.. పొల్యుష‌న్ కంట్రోల్‌తో పాటు సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణం