హత్యానా..? ప్రమాదమా..? అనుమానస్పదంగా మృతి  చెందిన యువతి ..  

Published : Jul 26, 2023, 05:45 AM IST
హత్యానా..? ప్రమాదమా..? అనుమానస్పదంగా మృతి  చెందిన యువతి ..   

సారాంశం

భద్రాది కొత్తగూడెంలోని ఇల్లందు మండలంలో ఓ యువతి అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. ఆ యువతిపై  గ్రామంలో భిన్నస్వరాలు వెలువడ్డాయి. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించడంతో స్థానికంగా ఉత్కంఠ నెలకొన్నది

భద్రాది కొత్తగూడెంలోని ఇల్లందు మండలంలో ఓ యువతి అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. ఆ యువతిపై  గ్రామంలో భిన్నస్వరాలు వెలువడ్డాయి. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించడంతో స్థానికంగా ఉత్కంఠ నెలకొన్నది. 

వివరాల్లోకెళ్తే.. ఇల్లందు మండలం సీఎస్‌పీ గ్రామపంచాయతీ పరిధిలోని పోలంపల్లి రాజీవ్ నగర్ తండాకు చెందిన అజ్మీర్ సింధు, అజ్మీర్ హరిలాల్ ఇద్దరు అన్న చెల్లెలు.  వీరి తండ్రి రెండేళ్ల క్రితమే చనిపోయాడు. వీరి తల్లి అజ్మీర దేవి కూలి పనులు జీవనం సాగిస్తుంది. ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా..సింధు ఓ ప్రైవేట్ వైద్యశాలలో పనిచేస్తున్నది. అయితే సోమవారం ఉదయం (సింధు) సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. వీడియోలు, ఫోటోలు పెట్టడంపై అభ్యంతరం తెలిపాడు. ఈ క్రమంలో హరిలాల్, సింధు మధ్య గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు. 

ఈ క్రమంలోనే కోపొద్రిక్తుడైన  హరిలాల్.. సింధు తలపై రోకలిబండతో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడిందని, ఆమెను వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ.. రాత్రి చనిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే మంగళవారం ఉదయం సింధు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

హరిలాలే సింధుపై రోకలిబండతో కొట్టి హతమొందించాడనీ, మరికొందరూ వర్షాల వల్ల ఇంటిపై పెట్టిన రాయి జారిపడి ఆమె తలపై పడి తీవ్రంగా  గాయపడిందని మరికొందరు అంటున్నారు. దీంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సింధు మృతిపై అనుమానం ఉండటంతోనే పోస్ట్ మార్టానికి తరలించామని ఇల్లందు సీఐ కరుణాకర్ తెలిపారు. అయితే.. హరిలాల్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోందనీ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?