ఓయూలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం.... ఎవరున్నారో తేల్చాలంటూ సీపీకి విద్యార్ధి నేతల ఫిర్యాదు

Siva Kodati |  
Published : Feb 18, 2022, 09:33 PM ISTUpdated : Feb 18, 2022, 09:35 PM IST
ఓయూలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం....  ఎవరున్నారో తేల్చాలంటూ సీపీకి విద్యార్ధి నేతల ఫిర్యాదు

సారాంశం

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో (osmania university) నకిలీ సర్టిఫికెట్ల (fake certificate)  వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌కు (hyderabad police commissioner) ఫిర్యాదు చేశారు ఓయూ విద్యార్థి నేతలు

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు వున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో (osmania university) నకిలీ సర్టిఫికెట్ల (fake certificate)  వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌కు (hyderabad police commissioner) ఫిర్యాదు చేశారు ఓయూ విద్యార్థి నేతలు. ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో వున్న నకిలీ సర్టిఫికెట్లతో అమెరికాలో చదువుతున్న ముద్దం స్వామిపై ఈ సందర్భంగా సీపీకి ఫిర్యాదు చేశారు. ఇకపోతే.. నకిలీ సర్టిఫికెట్ వ్యవహారాన్ని ఉస్మానియా అధికారులు కూడా ధృవీకరించారు.

కన్సల్టేషన్, ఎడ్యుకేషన్, ఇనిస్టిట్యూట్స్‌ అడ్డాగా ఈ నకిలీ సర్టిఫికేట్ల దందా సాగుతోందని సీపీ దృష్టికి విద్యార్ధి నేతలు వివరించారు. అంతేకాదు.. ఈ దందాకు సంబంధించి తగిన ఆధారాలను సీపీకి అందజేశారు. ఇలా ఎంతమంది నకిలీ సర్టిఫికెట్లు పొందారో సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి నేతలు కోరుతున్నారు. ఇప్పటికే పలువురు ఫేక్ సర్టిఫికెట్లతో విదేశాలకు వెళ్లారని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక అధికారుల పాత్రపైనా విద్యార్ధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని, ముద్దం స్వామిని 10 రోజులలో అదుపులోకి తీసుకుంటామని సీపీ సీవీ ఆనంద్ విద్యార్ధులకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 

ఇకపోతే .. నగరంలోని మలక్‌పేటలో అంతరాష్ట్ర Fake Certificates తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ CV Anand  చెప్పారు. మంగళవారం నాడు హైద్రాబాద్‌లోని తన కార్యాలయంలో సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. ఒక్కో డిగ్రీకి ఒక్కో రేటు చొప్పున వసూలు చేస్తున్నారని సీవీ ఆనంద్ చెప్పారు. నకిలీ సర్టిఫికెట్స్ కొనుగోలు చేసిన ఏడుగురుStudents కూడా అరెస్ట్ చేసినట్టుగా సీవీ ఆనంద్ తెలిపారు.

తల్లిదండ్రులకు తెలిసే విద్యార్ధులు నకిలీ సర్టిఫికెట్లు కొనుగోలు చేశారని సీపీ వివరించారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల స్కాంపై దర్యాప్తు చేసేందుకు గాను  SIT ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీపీ ఆనంద్ తెలిపారు.మలక్‌పేటలో శ్రీసాయి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న 10 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశామన్నారు.నకిలీ సర్టిఫికెట్లతో ఉన్నత విద్యా వ్యవస్థ నాశనం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

2021 డిసెంబర్ 19న నకిలీ సర్టిపికెట్లు తయారు చేస్తున్న ముఠాను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బషీర్ బాగ్ లోని ఒ కార్యాలయంలో నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఆ సంస్థపై దాడి చేసి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు.  ఇంటర్, డిగ్రీ, బిటెక్ తో పాటు ఇతర సర్టిఫికెట్లను కూడా ఈ ముఠా తయారు చేస్తుందని పోలీసులు గుర్తించారు. సయ్యద్ నవీద్ అలియాస్ ఫైసల్,కన్సల్టెన్సీ యజమాని సయ్యద్ ఓవైసీ అల, డీటీపీ ఆపరేటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

తెలంగాణ యూనివర్శిటీకి చెందిన బీకామ్ 130 ఆంద్రా యూనివర్శిటీ బిటెక్ సర్టిఫికెట్లు, 27 మహారాష్ట్ర బోర్డు ఇంటర్మీడియట్ సర్టిపికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. నిందితులు ఉపయోగించిన కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు స్కానర్లను సర్టిఫికెట్ పత్రాల బండిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. నిందితులు నకిలీ సర్టిఫికెట్లను ఉపయోగించి విదేశాలకు విద్యార్ధులను పంపుతున్నారని అప్పటి సీపీ అంజనీకుమార్ చెప్పారు. విదేశాలకు వెళ్లే విద్యార్ధుల నుండి రూ. 50 నుండి రూ75 వేలు వసూలు చేసేవారని సీపీ వివరించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది