టీఆర్ఎస్ వాహనంపై ప్రత్యర్థుల దాడి...ఉద్రిక్తత

By Arun Kumar PFirst Published Dec 4, 2018, 8:52 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజుల మాత్రమే మిగిలివుంది. దీంతో ముఖ్యమైన రాజకీయ పార్టీలన్ని తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో  ప్రత్యర్థి పార్టీలు ఒకరికొకరు ఎదురపడిన సమయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. నాయకులు సంయమనంతో వ్యవహరిస్తున్నా కార్యకర్తలు మాత్రం రెచ్చిపోతున్నారు. ఇలా మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పార్టీల కార్యకర్తల మద్య ఘర్షన జరిగి పోలీస్ కేసులు పెట్టుకునే దాకా వెళ్లింది. 

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజుల మాత్రమే మిగిలివుంది. దీంతో ముఖ్యమైన రాజకీయ పార్టీలన్ని తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో  ప్రత్యర్థి పార్టీలు ఒకరికొకరు ఎదురపడిన సమయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. నాయకులు సంయమనంతో వ్యవహరిస్తున్నా... కార్యకర్తలు మాత్రం రెచ్చిపోతున్నారు. ఇలా మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పార్టీల కార్యకర్తల మద్య ఘర్షన జరిగి పోలీస్ కేసులు పెట్టుకునే దాకా వెళ్లింది. 

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం నాగారం గ్రామంలో మహాకూటమి అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో అనుచరులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళుతుండగా ఓ టీఆర్ఎస్ ప్రచార వాహనం ఆ ర్యాలీకి అడ్డంగా వెళ్లింది. దీంతో ఆగ్రహంతో కొందరు ఆ వాహనంపై దాడి చేశారు. తమ పార్టీ వాహనంపై దాడి జరిగినట్లు తెలసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడి చేరుకోవడంలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాలు ఘర్షనకు దిగాయి. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను సమాదాయించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఇరువర్గాలు మళ్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఒకరిపై మరికరు పిర్యాదు చేసుకున్నారు.  

click me!