చెప్పుల ట్రీట్‌మెంట్‌ కాంగ్రెస్‌ నేతలకే కావాలి.. రైతులకు కాదు.. - కేటీఆర్‌

By Sairam Indur  |  First Published Jan 25, 2024, 12:12 PM IST

చెప్పుల ట్రీమ్ మెంట్ కాంగ్రెస్ (Congress) నాయకులకే కావాలని, రైతులకు కాదని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఎన్నికలకు ముందు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి (Revanth reddy) ఇంత వరకు ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. 


రైతుబంధు సాయం అందడం లేదన్న వారిని చెప్పుతో కొట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రైతుబంధు సొమ్మును తమ ఖాతాల్లో జమ చేయడంలో విఫలమైన కాంగ్రెస్ నాయకులకే చెప్పుల ట్రీట్ మెంట్ కావాలని అన్నారు. రైతులకు అవసరం లేదని చెప్పారు. 

రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్..

Latest Videos

undefined

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలను చెప్పులతో తిప్పికొడతారా లేక ఓట్లతో కొడతారా అనేది రైతులు ఆలోచించికోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంక్షోభంలో ఉన్నా వారిలో చాలా మందికి ఇంతవరకు రైతుబంధు సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతు భరోసా పథకం అమలును ఇప్పటికే ప్రారంభించామని దావాస్ లో సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారని విమర్శించారు. 

లక్షల్లో భక్తులు, కోట్లల్లో ఆదాయం... మరో తిరుమలను తలపిస్తున్న అయోధ్య

70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమ చేయడం కేసీఆర్ వల్లే సాధ్యమైందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరు హామీల గురించి మాత్రమే మాట్లాడిందని, వాస్తవానికి ఎన్నికలకు ముందు వివిధ వర్గాల ప్రజలకు 420 హామీలు ఇచ్చిందని విమర్శించారు. 100 రోజుల్లో హామీలను అమలు చేయకపోతే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని కాంగ్రెస్ నాయకులకు ఆయన హెచ్చరించారు.

ప్రతిపక్షంలో బుద్దిగా పని చేయ్ కేటీఆర్ - మంత్రి సీతక్క ఫైర్

అధికారంలోకి వచ్చాక రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. అలాగే రైతులకు క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఆ రెండు హామీలను ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.4 వేల నిరుద్యోగ భృతి హామీల పరిస్థితి కూడా అలాగే ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని కేటీఆర్ అలా అయితే బీజేపీ నాయకులైన ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, సోయం బాపురావ్ లను తమ పార్టీ ఎందుకు ఓడించిందని ప్రశ్నించారు.

ఏబీవీపీ నాయకురాలి జుట్టు పట్టుకొని లాగిన కానిస్టేబుల్.. వీడియో వైరల్.. ఎమ్మెల్సీ కవిత ఫైర్.. 

2019 లోక్ సభ ఎన్నికలతో పాటు హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ తన ఓట్లను బీజేపీ అభ్యర్థులకు మళ్లించిందని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మధ్య రహస్య ఒప్పందం గురించి ఆరోపణలు చేస్తుండగానే.. మరో వైపు ఆ పార్టీకే చెందిన రేవంత్ రెడ్డి దావోస్ లో అదానీతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఎప్పుడూ కూడా తన వ్యాపార ఆఫర్లతో అదానీని రాష్ట్రంలోకి అనుమతించలేదని, కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇక్కడి అన్ని ప్రభుత్వ సంస్థలను అదానీకి అప్పగించేందుకు కుట్ర పన్నుతున్నారని కేఆర్ ఆరోపించారు.

click me!