ఒకే వేదికపై పీకే, కవిత .. పవర్ పుల్ స్పిచ్‌కు రెడీ అవుతున్న టీఆర్ఎస్ మాజీ ఎంపీ

By Rekulapally SaichandFirst Published Dec 9, 2019, 11:01 AM IST
Highlights

టీఆర్ఎస్  మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వా నం అందింది. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్బీ)లో జరిగే ఇండియన్‌ డెమోక్రసీ ఎట్‌ వర్క్‌ సదస్సులో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు ఆమెను ఆహ్వానించారు.

టీఆర్ఎస్  మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వా నం అందింది. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్బీ)లో జరిగే ఇండియన్‌ డెమోక్రసీ ఎట్‌ వర్క్‌ సదస్సులో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు ఆమెను ఆహ్వానించారు. వచ్చే జనవరి 9-10 తేదీల్లో జరుగనున్న సదస్సులో ‘మనీ పవర్‌ ఇన్‌ పాలిటిక్స్‌' అంశంపై మాజీ ఎంపీ కవిత ప్రసంగించనున్నారు.

అయితే  వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హజరుకానున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య, జాతీయ  సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, ఎలక్షన్ కమీషనర్ అశోక్ లావస, బీజేపీ నేత రాంమాధవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్, సీపీఎం జాతీయ కార్యదర్శి ఏచూరి, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ్,  రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన 30మంది‌కి పైగా ప్రతినిధులు ‌ఈ సదస్సుకు రావల్పిందిగా ఆహ్వనం అందింది. 

click me!