రెండేసి టికెట్లు అడుతున్న ఫ్యామిలీలు ఇవే: తేల్చేసిన కాంగ్రెస్

Published : Oct 13, 2018, 03:07 PM ISTUpdated : Oct 13, 2018, 04:06 PM IST
రెండేసి టికెట్లు అడుతున్న ఫ్యామిలీలు ఇవే: తేల్చేసిన కాంగ్రెస్

సారాంశం

ఫామిలీ సీట్లపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. ఒక్క ఫామిలీ ఒకే టిక్కెట్ అంటూ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ షరతు నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ కు మాత్రం మినహాయింపు ఇచ్చింది.

 

హైదరాబాద్: ఫామిలీ సీట్లపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. ఒక్క ఫామిలీ ఒకే టిక్కెట్ అంటూ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ షరతు నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ కు మాత్రం మినహాయింపు ఇచ్చింది.

మహాకూటమిలో సీట్ల సర్ధుబాటుపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు వేగవంతం చేసింది. కాంగ్రెస్ పార్టీలో సీట్ల సర్ధుబాటుపై మూడు రోజులపాటు సమాలోచనలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ తుది నివేదికను రూపొందించింది. ఈ నివేదికన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సమర్పించింది. ఈ నేపథ్యంలో దాదాపు పదిమంది సీనియర్ నేతలు రెండో టిక్కెట్ అడుగుతున్నారన్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా అందుకు అధిష్టానం ససేమిరా అంది. 

ఒక్క ఫామిలీకి ఒకే సీటు అంటూ అధిష్టానం తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదన నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ ను మినహాయిస్తున్నట్లు ప్రకటించింది.  

ముందస్తు ఎన్నికల్లో తమ వారసులను బరిలోకి దించి వారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సుమారు పదిమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు రెండో సీటుపై కన్నేశారు. 

ఈ నేపథ్యంలో పీసీసీపైనా, ఏఐసీసీ పైనా సీనియర్ నేతలు ఒత్తిడితెచ్చారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ రెండో సీట్ల అంశంపై పెద్ద కసరత్తు చేసింది. నివేదిక ఆధారంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒకే ఫ్యామిలీకి ఒకే టిక్కెట్ అంటూ నిర్ణయించింది.  

ఇకపోతే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి కోసం రెండో సీటు ఆశిస్తున్నారు. జానారెడ్డి ప్రస్తుతం నాగార్జన సాగర్ నుంచి పోటీ చేస్తానని తన కుమారుడు రఘ్ వీర్ రెడ్డికి మిర్యాలగూడ టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అటు కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ సైతం తన కుమార్తె స్నిగ్థారెడ్డిని ఈ ఎన్నికల్లో బరిలో దించాలని చూస్తున్నారు. అందువల్ల స్నిగ్ధారెడ్డికి ముక్తల్ సీటు ఆశిస్తున్నారు. 

మరోవైపు మాజీ హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం రెండో సీటు ఆశిస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం పోటీ చేస్తానని అయితే ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డికి రాజేందర్ నగర్ టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ సైతం రెండో సీటు ఆశిస్తున్నారు. అతని భార్య పద్మినీరెడ్డికి సంగారెడ్డి టిక్కెట్ కోరుతున్నారు.  

మరోవైపు సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సైతం రెండో సీటు ఆశిస్తున్నారు. తన కుమారుడు యూత్ లీడర్ అనిల్ యాదవ్ కు ముషీరాబాద్ టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరో సీనియర్ నేత మాజీమంత్రి ముఖేష్ గౌడ్ సైతం తన తనయుడు విక్రంగౌడ్ కు ముషీరాబాద్ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. 

అటు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సైతం తన అల్లుడు క్రిశాంక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కంటోన్మెంట్ సీటును తన అల్లుడుకు కేటాయించాలంటూ పట్టుబడుతున్నారు. అందులో భాగంగానే నాలుగురోజుల క్రితం ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో గెలిచే వారికే టిక్కెట్ ఇవ్వాలని కుటుంబాలు చూడొద్దంటూ సర్వే కామెంట్ చేశారు. ఇలా దాదాపు పదిమంది సీనియర్లు రెండో సీటు ఆశించడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారింది.  

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ అంటూ బాహటంగా విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పదిమందికి రెండేసి సీట్లు ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పార్టీ అని ముద్ర వేసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ అధిష్టానం ఆశిస్తుంది. 119 సీట్లలో పదికుటుంబాలు 20 టిక్కెట్లు ఆశిస్తే మిగిలిన వారికి ఏం సమాధానం చెప్పాలని పార్టీ తర్జనభర్జనలో పడింది.  

మరోవైపు ఒక్క ఫామిలీ ఒకే సీటు నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ ను మినహాయించినట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిరెడ్డి కోదాడ సిట్టింగ్ స్థానంలో ఉన్నారు. దాంతో ఉత్తమ్ కుమార్ రెడ్డికి మినహాయింపు లభించినట్లైంది. అటు కోమటిరెడ్డి బ్రదర్స్ కు సైతం ఈ మినహాయింపు లభించింది. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశిస్తున్న మునుగోడు సీటును ఆయనకే కేటాయించినట్లు సమాచారం. ఎమ్మెల్సీగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందస్తు ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. అందులో భాగంగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం సీటు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు. 

ఇటీవల నిర్వహించిన సర్వేలో మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపుకు సానుకూల వాతావరణం ఉందని తేలడంతో ఆ స్థానం క్లియర్ చేసింది. మరోవైపు మునుగోడు టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు కూడా.  

ఇకపోతే 2014 ఎన్నికల్లో అనూహ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పద్మావతిరెడ్డికి కోదాడ సీటు ను తెచ్చుకున్నారు. దాని బూచిగా చూపిస్తూ ఈసారి పదిమంది సీనియర్లు ఆశించారు. చివరి క్షణం వరకు పట్టుబట్టారు. జానారెడ్డి అయితే తన కుమారుడు రఘువీర్ రెడ్డి కోసం ఢిల్లీలో మకాం వేశారు కూడా. అయితే ఒక్కఫామిలీకి ఒకే టిక్కెట్ అని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చిచెప్పడంతో సీనియర్ల డైలమాలో పడ్డారు.  

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌