నాయిని మొండిపట్టు: కేసీఆర్ కు తలనొప్పి ఇదీ...

By pratap reddyFirst Published Oct 13, 2018, 2:49 PM IST
Highlights

శ్రీనివాస్ రెడ్డికి ముషీరాబాద్ టికెట్ ఇస్తే వచ్చే తలనొప్పుల గురించి కేసీఆర్ నాయినికి పూస గుచ్చినట్లు చెప్పారని సమాచారం. కార్పోరేటర్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డికి ముషీరాబాద్ శానససభ టికెట్ ఇస్తే అటువంటి డిమాండ్లే తలనొప్పిగా మారుతాయని కేసిఆర్ చెప్పారని సమాచారం. 

హైదరాబాద్: ముషీరాబాద్ సీటు విషయంలో ఆపద్ధర్మ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మొండిపట్టు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుకు తలనొప్పిగా మారింది. తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని నాయిని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆ సీటును గత ఎన్నికల్లో పోటీ చేసిన ముఠా గోపాల్ కు కేసిఆర్ ఖరారు చేశారు. 

శ్రీనివాస్ రెడ్డికి ముషీరాబాద్ టికెట్ ఇస్తే వచ్చే తలనొప్పుల గురించి కేసీఆర్ నాయినికి పూస గుచ్చినట్లు చెప్పారని సమాచారం. కార్పోరేటర్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డికి ముషీరాబాద్ శానససభ టికెట్ ఇస్తే అటువంటి డిమాండ్లే తలనొప్పిగా మారుతాయని కేసిఆర్ చెప్పారని సమాచారం. 

ఉప్పల్ టికెట్ హైదరాబాదు మేయర్ బొంతు రామ్మోహన్ ఆశిస్తున్నారు. దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి కూతురు విజయా రెడ్డి, కె. కేశవ రావు కూతురు విజయలక్ష్మి ఖైరతాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరు కూడా కార్పోరేటర్లుగా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇస్తే ఆ ముగ్గురు కూడా తమకు టికెట్లు కావాలనే డిమాండ్ ను ముందుకు తెస్తారని కేసిఆర్ నాయినికి చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే, శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే తనకు ఇవ్వాలని నాయిని మరో మెలిక పెట్టారు. తానే పోటీ చేస్తానని అంటున్నారు. 2014 ఎన్నికల్లో అడిగితే తాను పోటీ చేయబోనని నాయిని చెప్పారు. దాంతో ముఠా గోపాల్ కు టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ నాయిని నర్సింహా రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన పదవీ కాలం ఇంకా రెండేళ్లు ఉంది. ఈ స్థితిలో నాయిని నర్సింహా రెడ్డి మెలిక పెట్టడం కేసీఆర్ కు తలనొప్పిగా మారిందని అంటున్నారు. 

click me!