బంపర్ ఆఫర్..రూ.3కే చీర

Published : Sep 25, 2018, 01:56 PM ISTUpdated : Sep 25, 2018, 02:10 PM IST
బంపర్ ఆఫర్..రూ.3కే చీర

సారాంశం

3 రూపాయల చీరను సొంతం చేసుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున్న పోటెత్తారు. దీంతో కాసం పుల్లయ్య షాపింగ్‌ మాల్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. 

మహిళలకు ఓ షాపింగ్ మాల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.3కే చీర ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇంతకీ  ఆ షాపింగ్ మాల్ పేరేంటో తెలుసా.. కాసం పుల్లయ్య షాపింగ్ మాల్. వరంగల్ నగరంలో ఉంది. ప్రస్తుతం వరంగల్ చుట్టుపక్కల గ్రామాల్లోని స్త్రీలంతా..ఆ షాప్ దగ్గరే ఉన్నారు. కొందరు షాప్ లో నచ్చిన చీరలు ఎంపిక చేసుకుంటుంటే.. మరికొందరు లోపలికి వెళ్లేందుకు క్యూలైన్ లో నిల్చున్నారు.

3 రూపాయల చీరను సొంతం చేసుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున్న పోటెత్తారు. దీంతో కాసం పుల్లయ్య షాపింగ్‌ మాల్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మహిళలు తండోపతండాలు తరలి రావడంతో  నోర్లు వెళ్లబెట్టిన షాపింగ్‌ మాల్‌ సిబ్బంది, పరిస్థితిని అదుపు చేయలేక పోలీసులకు ఫోన్‌ చేశారు. షాపింగ్‌ మాల్‌ను మూసివేశారు. కానీ అప్పటికే పరిస్థితి అంతా చేదాటిపోయింది. ఆఫర్లు ప్రకటించి, షాపింగ్‌ మాల్‌ మూసివేయడంపై మహిళలు తిరగబడ్డారు. ఏం చేయాలో పాలుపోలేక పోలీసులు కూడా చేతులెత్తేశారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?
KTR Speech: కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తాం.. ఎదురు దెబ్బలు పట్టించుకోము | Asianet News Telugu