జమిలి ఎన్నికలకు కేసీఆర్ సై: లా కమిషన్ కు లేఖ

Published : Jul 08, 2018, 01:20 PM IST
జమిలి ఎన్నికలకు కేసీఆర్ సై:  లా కమిషన్ కు లేఖ

సారాంశం

జమిలి ఎన్నికలకు టీఆర్ఎస్ సానుకూలమని ప్రకటించింది. ఈ మేరకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లా కమిషన్ కు లేఖ రాశారు.ఈ లేఖను లా కమిషన్ చైర్మెన్ కు టీఆర్ఎష్ ఎంపీలు ఆదివారం నాడు అందించారు.


హైదరాబాద్: జమిలి ఎన్నికలకు  తాము సంపూర్ణ మద్దతును తెలుపుతున్నట్టు టీఆర్ఎష్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు లా కమిషన్‌కు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లేఖ రాశారు.  ఆదివారం నాడు టీఆర్ఎస్ ప్రతినిధులు న్యూఢిల్లీలో లా కమిషన్ ను కలిసి  కేసీఆర్ రాసిన లేఖను అందించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అంటూ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున  ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ విషయమై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలపై  చర్చ జరగాలని నరేంద్ర మోడీ అభిప్రాయపడుతున్నారు.  ఆయా పార్టీల నుండి   లా కమిషన్  అభిప్రాయాలను కోరుతున్నారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలను లా కమిషన్ కు తమ అభిప్రాయాలను వివరిస్తున్నారు.

ఇందులో భాగంగానే జమిలి ఎన్నికలకు  తాము అనుకూలంగా ఉన్నామని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. లా కమిషన్ చైర్మెన్  కోరిన అభిప్రాయాలపై కేసీఆర్ తమ అభిప్రాయాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు.

లా కమిషన్ చైర్మెన్ ను కలిసి కేసీఆర్ రాసిన లేఖను  అందించారు.అయితే జమిలి ఎన్నికలను సీపీఐ, టీఎంసీ, డీఎంకే, గోవా ఫార్వర్డ్ పార్టీ నేతలు వ్యతిరేకించారు. అంతేకాదు 2024 నాటికి జమిలి ఎన్నికలు తమకు సమ్మతమేనని  అన్నాడీఎంకె ప్రకటించింది. జమిలి ఎన్నికలకు టీడీపీ అంతగా సానుకూలంగా లేదు. 

PREV
click me!

Recommended Stories

Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి
Free Bus Scheme : తెలుగోళ్లకు గుడ్ న్యూస్... మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం